Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డియర్ జిందగీకి కష్టాలు.. కరణ్-షారూఖ్‌లకు నోటీసులు.. కెనడియన్ టీవీ సిరీస్‌కు కాపీనా?

రయీస్ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ మోకాలి నొప్పితో కష్టాలు పడుతున్న బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇటీవల వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ షారూఖ్ ఖాన్, డియర్ జ

Advertiesment
Is Dear Zindagi copied from Being Erica: Here’s what Gauri Shinde has to say
, బుధవారం, 14 డిశెంబరు 2016 (11:19 IST)
రయీస్ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ మోకాలి నొప్పితో కష్టాలు పడుతున్న బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇటీవల వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ షారూఖ్ ఖాన్, డియర్ జిందగీ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌరీషిండే.. షారూఖ్, అలియా భట్‌లు లీడ్ రోల్‌లో డియర్ జిందగీ సినిమాను తెరకెక్కించారు.  
 
రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెరకెక్కిన డియర్ జిందగీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ఓ కెనడియన్ టీవీ సీరీస్‌కు కాపీ అన్న వాదన రిలీజ్‌కు ముందు నుంచే వినిపిస్తోంది. సినిమా రిలీజ్ తరువాత ఆ టాక్ మరింత ఎక్కువైంది.
 
షారూఖ్ లాంటి స్టార్ హీరో సినిమా కావటంతో ఒరిజినల్ వర్షన్ మేకర్స్ వరకు చేరిందట. దీంతో బీయింగ్ ఎరికా యూనిట్ సభ్యులు నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు షారూఖ్ ఖాన్‌లకు నోటిసులు పంపించారన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయంలో యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ ఎంగేజ్‌మెంట్‌లో మహేష్ బాబు కుమార్తె.. అందరి నోట సితార మాటే..