సినీ ఛాన్సుల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు కాదు : హీరోయిన్ ఇలియానా
చిత్ర పరిశ్రమకు చెందిన మరో టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నేను కాదని చెప్పుకొచ్చింది. ఒకపుడు టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఉన్న ఇలియానా... గతకొంత కా
చిత్ర పరిశ్రమకు చెందిన మరో టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నేను కాదని చెప్పుకొచ్చింది. ఒకపుడు టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఉన్న ఇలియానా... గతకొంత కాలంగా సినీ అవకాశాలు లేక హాట్ హాట్ ఫోటో షూట్‌లకే పరిమితమైంది.
దీనిపై ఆమె స్పందిస్తూ అవకాశాలు కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారనీ, తను ఆ టైపు కాదని చెప్పుకొచ్చింది. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ అడగను కనుకే తనకు సినిమాలు తగ్గాయి తప్ప మరో కారణం కాదని చెబుతోంది. అంతేకాకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందట!
తనకన్నా వయస్సులో కొంచెం పెద్ద అయిన వారు కూడా దూసుకుపోతుంటే, ఇలియానా మాత్రం ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనమైపోతోంది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కబుర్లు చెబుతోంది ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.