Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫర్లు రాలేదా... ఆ కొన్నీ ఇప్పేస్తే సరి అంటున్న భామ..!

చిత్రసీమ ఎంతమంది హీరోయిన్లను చూడలేదు. స్టార్‌డమ్ ఉన్నంతవరకు బికినీ కాదు గదా గికినీ జోలికి కూడా వెళ్లనని ఎంత బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇచ్చిన హీరోయిన్లు కూడా కెరీర్ కాస్త వెనకపట్టు పట్టగానే అన్నీ విప్పడానికి కూడా సై అంటూ చిందులేసిన వారు భారతీయ చిత్రపరిశ్ర

ఆఫర్లు రాలేదా... ఆ కొన్నీ ఇప్పేస్తే సరి అంటున్న భామ..!
హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (03:19 IST)
చిత్రసీమ ఎంతమంది హీరోయిన్లను చూడలేదు. స్టార్‌డమ్ ఉన్నంతవరకు బికినీ కాదు గదా గికినీ జోలికి కూడా వెళ్లనని ఎంత బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇచ్చిన హీరోయిన్లు కూడా కెరీర్ కాస్త వెనకపట్టు పట్టగానే అన్నీ విప్పడానికి కూడా సై అంటూ చిందులేసిన వారు భారతీయ చిత్రపరిశ్రమలో లెక్కకు కొదువలేదు. ఇప్పుడు అదే కోవలో మరొక భామ కూడా చేరిపోయంది. సిద్ధు ప్రమ్ సికాకుళం హీరోయిన్ ఇప్పుడు రొమాంటిక్ సీన్స్‌లో అదరగొడుతోందని వార్తలు. ఇంతకూ ఎవరా ముద్దుగుమ్మ
 
మంజరీ ఫడ్నిస్ అనే కన్నా.. సిద్ధూ ఫ్రమ్ సికాకుళం, శుభప్రదం, శక్తి వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన భామ అంటేనే మనోళ్లకు ఆ బ్యూటీ గుర్తుకొస్తుంది. మూడు నాలుగు సినిమాల్లో నటించినా చెప్పుకోదగ్గ హిట్టు అందుకోలేకపోయిన ఈ బ్యూటీ... ప్రస్తుతం తెలుగునాట కనిపించడమే మానేసింది. ఎన్ని భాషల్లో నటించినా ఒక్క దాన్లోనూ నటిగా మెప్పించలేకపోతున్న ఆ బ్యూటీ.. తాజాగా గ్లామర్ డోస్ పెంచేసి.. బోల్డ్నెస్‌కు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిందట. 
 
హిందీలోనూ అరకొర ఆఫర్లతోనే బండి లాగించేస్తున్న మంజరి... కొంతకాలంగా అవికూడా లేనంత దీన స్థితికి చేరుకుంది. చివరకు బీగ్రేడ్ చిత్రాల్లోనూ నటించే స్థాయికి చేరుకున్న మంజరి.. ఇక ఇలా అయితే లాభం లేదనుకుని గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. అప్పుడప్పుడు కన్నడ, మలయాళ, మరాఠీ చిత్రాల్లోనూ తళుక్కుమన్న మంజరి... ప్రస్తుతం బాలీవుడ్‌లో 'జీనా ఇసీకా నామ్ హై' అనే చిత్రంలో నటిస్తోంది. 
 
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా... రాక రాక కాస్త మంచి ఆఫర్ రావడంతో తన టాలెంట్ అంతా ప్రదర్శించేస్తోంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌లో అమ్మడు చెలరేగిపోయిందనే చెప్పాలి. మరి ఈ చిత్రమైనా మంజరి ఫడ్నిస్ కెరీర్ కు ఊపునిస్తుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలియానాను కత్రినా కైఫ్ ఫాలో అవుతుందా? బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో?