Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేను.. రీమేక్ చిత్రాల్లో నటించను : సాయిపల్లవి

వరుణ్ తేజ్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫిదా. ఈ చిత్రంతో తెలుగువారందరినీ ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. ‘ఫిదా’ సినిమాలో భానుమతి పాత్ర విపరీతంగా ఆదరణ పొందింది.

Advertiesment
క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేను.. రీమేక్ చిత్రాల్లో నటించను : సాయిపల్లవి
, ఆదివారం, 30 జులై 2017 (12:15 IST)
వరుణ్ తేజ్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫిదా. ఈ చిత్రంతో తెలుగువారందరినీ ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. ‘ఫిదా’ సినిమాలో భానుమతి పాత్ర విపరీతంగా ఆదరణ పొందింది. అయితే ‘ఫిదా’ సినిమాను ఇతర భాషల్లో రీమేక్‌ చేసినా తను మాత్రం భానుమతి పాత్రలో నటించేది లేదని ఆమె తేల్చి చెప్పింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘రీమేక్‌ సినిమాలో నటించడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే ఒరిజినల్‌లో ఉండే ఫీల్‌ రీమేక్‌ సినిమాలో ఉండదు. నేనైతే ఒక్కసారి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ మళ్లీ ఇవ్వలేను. ఒరిజినల్‌ కథలో నటించడం, ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయడమే నాకిష్టం. అప్పుడే ఆ పాత్రపై మనదైన ముద్ర వేయగలం. అందుకే నేను రీమేక్‌లో నటించన’ని ఆమె స్పష్టం చేసింది.
 
కాగా, 'ఫిదా' సినిమా హిట్‌తో సాయిపల్లవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. తమ ప్రాజెక్టును ఓకే చేయమంటూ భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని సమాచారం. కానీ సాయిపల్లవి మాత్రం కొత్తగా ఒక్క సినిమాను కూడా ఒప్పుకోలేదట.
 
తనకి డబ్బే ప్రధానమని అనుకుంటే మలయాళంలో ఈ పాటికే చాలా సినిమాలు చేసి వుండేదానిననీ, పది కాలాల పాటు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నానని తన సన్నిహితుల వద్ద చెపుతోంది. అలాంటి పాత్రలు వస్తే చేయడానికి తానే ఆసక్తి చూపుతానని తెలిపింది. పారితోషికమనేది తనకి ఎప్పటికీ ప్రధానం కాదని స్పష్టం చేసింది. క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచన లేని ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని చూసి దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బిగ్‌బాస్' నుంచి సంపూ వైదొలగడానికి కారణమిదే...