Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని త్వరలోనే పెళ్లాడుతా.. విశాల్ చెప్పింది వరలక్ష్మినేనా?

లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి హీరో విశాల్ ప్రకటించాడు. విశాల్ తాజా సినిమా తుప్పరివాలన్ టీజర్ విడుదల సందర్భంగా విశాల

లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని త్వరలోనే పెళ్లాడుతా.. విశాల్ చెప్పింది వరలక్ష్మినేనా?
, శుక్రవారం, 21 జులై 2017 (12:53 IST)
లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి హీరో విశాల్ ప్రకటించాడు. విశాల్ తాజా సినిమా తుప్పరివాలన్ టీజర్ విడుదల సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పోరాట దృశ్యాలు అద్భుతంగా వుంటాయన్నారు. నటుడిగా, నిర్మాతగా ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమన్నారు. 
 
ఈ చిత్రంలో విశాల్ సరసన అను ఇమ్మాన్యూయేల్ నటిస్తుండగా, కె.భాగ్యరాజ్, ప్రసన్న వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మీదేవి లాంటి అమ్మాయి అని విశాల్ అనగానే అతడు త్వరలోనే వరలక్ష్మిని పెళ్లి చేసుకునే ఛాన్సుందని కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. గత కొన్నేళ్లుగా, వరలక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పెళ్లాడుతానని విశాల్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంకా విశాల్ మాట్లాడుతూ, నిస్వార్థుడైన కామరాజ్‌లా జీవించాలనుకుంటున్నట్లు తెలిపాడు. నడిగర్ సంఘంతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం సినీ లెజెండ్ కమల్ హాసన్ వెన్నంటి వుంటుందని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ ముఖ్యమంత్రి, కమల్ హాసన్ ఉప ముఖ్యమంత్రి.. విజయ్, అజిత్ అదే పార్టీలో?