Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక కష్టాల్లో హీరో వెంకటేష్... పెద్ద నోట్ల రద్దుతో తప్పని కరెన్సీ కష్టాలు!

టాలీవుడ్ అగ్రహీరోల్లో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. అగ్రనిర్మాత దివంగత డాక్టర్ డి.రామానాయుడు తనయుడు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడ

Advertiesment
Hero Venkatesh
, గురువారం, 22 డిశెంబరు 2016 (12:55 IST)
టాలీవుడ్ అగ్రహీరోల్లో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. అగ్రనిర్మాత దివంగత డాక్టర్ డి.రామానాయుడు తనయుడు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఆయనను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. 
 
వాస్తవానికి పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడటమే కాకుండా దాని ప్రభావం దేశంలోని అన్ని రంగాలపైనా తీవ్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఈ నోట్ల కష్టాలు టాలీవుడ్ సినిమా రంగాన్ని కూడ షేక్ చేస్తున్నాయి. 
 
దీంతో పలు చిత్రాల షూటింగ్‌లు రద్దు కాగా, మరికొన్ని చిత్రాలు విడుదలకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. సెట్స్ మీద ఉన్న కొన్ని సినిమాలు ఆగిపోయాయి. ఈ షాక్ నుంచి టాలీవుడ్ సినిమా రంగం ఎప్పటికి బయట పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాప్ హీరో విక్టరీ వెంకటేష్ తాజా మూవీని కూడా కరెన్సీ కష్టాలు చుట్టుముట్టాయి. ఫళితంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. 
 
ఇటీవలి కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వెంకటేష్.. ఇపుడు వరుసబెట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆలిస్టులో 'గురు' మూవీ షూటింగ్ కంప్లీట్ అయి ఇప్పటికే రిలీజ్‌కి సిద్ధంగా ఉండగా, 'నేను శైలజ' డైరెక్టర్ కిషోర్ తిరుమల తీస్తున్న 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే మూవీకి ఈ నోట్ల దెబ్బ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి.
 
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఈ నోట్ల కష్టాలతో ఈసినిమాను ప్రస్తుతం ఆపివేశారని ఫిలింనగర్ టాక్. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ బయటకు చెప్పక పోయినా ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఈ సినిమా యూనిట్‌కే తెలియని పరిస్థుతులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాప్ రే.. సోనమ్ సోయగాలు... ఉల్లిపొర దుస్తుల్లో చూడతరమా? (ఫోటోలు)