Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి కాబోతున్న ఈగ నాని.. అంజన గర్భవతి.. మరో రెండు నెలల్లో పండంటి బిడ్డ...?

నేచురల్ స్టార్ నాని తండ్రి కాబోతున్నాడు. ఓ సాధారణ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి స్టార్‌ హీరో రేంజ్‌కు ఎదిగిన నాని.. త్వరలో తండ్రి కాబోతున్నాడని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. 2012

Advertiesment
తండ్రి కాబోతున్న ఈగ నాని.. అంజన గర్భవతి.. మరో రెండు నెలల్లో పండంటి బిడ్డ...?
, శనివారం, 19 నవంబరు 2016 (12:06 IST)
నేచురల్ స్టార్ నాని తండ్రి కాబోతున్నాడు. ఓ సాధారణ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి స్టార్‌ హీరో రేంజ్‌కు ఎదిగిన నాని.. త్వరలో తండ్రి కాబోతున్నాడని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. 2012లో విశాఖపట్నానికి చెందిన అంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్న నానికి త్వరలో తండ్రి అనే ప్రమోషన్ రాబోతుందని తెలిసింది. నాని భార్య అంజన ప్రస్తుతం గర్భవతి అని సమాచారం. మరో రెండు నెలల్లో అంజన ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందట. ఈ వార్త వినగానే నాని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. ఈ ఏడాది నానికి బాగా కలిసొచ్చింది. మూడు సినిమాలు హిట్ అయ్యాయి. చివరిగా నాలుగో సినిమా 'నేను లోకల్' కూడా విడుదల కాబోతోంది. 'మజ్ను' లాగే ఈ సినిమాను మొదలుపెట్టిన నాలుగు నెలలకే రిలీజ్ చేసేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23న నాని కొత్త సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. ఈ చిత్రంతో శివ శంకర్ లాలం అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. 'ఎవడే సుబ్రమణ్యం' తర్వాత నాని మళ్లీ ఓ కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా ఇదే.
 
విశేషం ఏంటంటే.. శివశంకర్ టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాడు. సుకుమార్ లాగే అతను కూడా లెక్చరర్గా పని చేసి.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశాడు. నాని-శివ శంకర్ చిత్రాన్ని బడా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. రైటర్ కోన వెంకట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. 'జెంటిల్మన్' సినిమాలో నానికి దీటుగా నటించి మెప్పించిన నివేదా థామసే ఇందులోనూ కథానాయికగా నటించనుంది. 'సరైనోడు'తో తెలుగులో తొలి హిట్ అందుకున్న ఆది పిని శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కుమార్తె సిద్ధంగా ఉంది.. మంచి కథతో రండి.. గౌతమి