Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది బాహుబలి కాదు.. బాహుబల్లి... తమిళ హీరో కార్తీ సెన్సేషనల్ కామెంట్స్

కార్తీ, నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ''కాష్మోరా'' చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూ

Advertiesment
అది బాహుబలి కాదు.. బాహుబల్లి... తమిళ  హీరో కార్తీ సెన్సేషనల్ కామెంట్స్
, గురువారం, 27 అక్టోబరు 2016 (12:15 IST)
కార్తీ, నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ''కాష్మోరా'' చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజమౌళి రూపొందించిన బాహుబలి చూశాక మా చిత్రాన్ని మరికొంత నాణ్యతగా తీర్చిదిద్దేందుకు కొంత సమయం తీసుకున్నాం అన్నారు.
 
ఇకపోతే ఈ సినిమా విడుదలకి దగ్గరయ్యే కొద్దీ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ట్రెయిలర్‌లో యుద్ధ సన్నివేశాలు, కట్టప్ప గెటప్‌లో కార్తీని చూసి ఇది బాహుబలికి కోలీవుడ్‌ ఆన్సర్‌ అంటూ అక్కడి జనం గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు దీనిని మరో బాహుబలిలా ఊహించేసుకుంటున్నారు. అయితే ఈ హైప్‌ ఎక్కడ తిప్పికొడుతుందో అనే భయం కార్తీని, చిత్ర బృందాన్ని వెంటాడుతోంది. ఈ విషయంపై స్పందించిన యూనిట్.. 'కాష్మోరా'కీ, బాహుబలికీ పొంతనే ఉండదని, దయ చేసి పోలికలు వెతక్కండని వాళ్లు పదే పదే రిక్వెస్ట్‌ చేస్తున్నారు.
 
కార్తీ అయితే బాహుబలి ముందు తమ సినిమా ఒక బల్లి మాదిరి అని చెప్పడానికి సైతం వెనకాడడం లేదు. ఎలాగైనా అంచనాలు తగ్గించి, ఈ బాహుబలితో పోలిక తప్పించాలని కాష్మోరా బృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ సినిమా కోసం నానా కష్టాలు పడ్డ కార్తీ ఇలా అనుకోని ఇబ్బంది వచ్చి పడటంతో తన చిన్న సినిమాని ఎలా కాపాడుకోవాలో తెలీక అడిగిన వాళ్లకీ, అడగని వాళ్లకీ కూడా మాది బాహుబలి కానే కాదు బాబూ అంటూ చెప్పుకుంటున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను సినిమా చూస్తే ప్లాప్ అవుతుందట.. ఫ్యాన్స్ అంటున్నారు.. సమంత