చెన్నై నగర రోడ్లపై అర్థరాత్రిపూట హన్సిక ఎలాంటి పని చేసిందో తెలుసా?
సాధారణంగా ఎవరికైనా సహాయం చేయాలంటే కొందరు చడీచప్పుడుకాకుండా తమ వంతు సాయాన్నిచేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో హన్సిక కూడా చేరిపోయింది. హన్సిక చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ
సాధారణంగా ఎవరికైనా సహాయం చేయాలంటే కొందరు చడీచప్పుడుకాకుండా తమ వంతు సాయాన్నిచేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో హన్సిక కూడా చేరిపోయింది. హన్సిక చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఈ భామ ఏం చేసిందో తెలుసా...?
చెన్నైలో రాత్రి సమయాల్లో రోడ్ల మీద నిద్రపోతున్న నిరాశ్రయుల దగ్గరకు నిశ్శబ్దంగా వెళ్లి వాళ్ల పక్కన సామాగ్రిని ఉంచి వారికి తన వంతు సాయం చేసింది. ఆమె చేస్తున్న ఈ సమాజసేవను వీడియో తీసిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
వర్షాకాలం కారణంగా రోడ్డు మీద ఉండే ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ల బాధను అర్థం చేసుకుని వారికి కప్పుకోవడానికి దుప్పట్లు, తినడానికి ఆహారం, మంచి నీరు అందించింది. అలాగే ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలుపుతూ 'ఇది వర్షాకాలం. దయచేసి మీరు కూడా మీ వంతు సాయం చేయండి' అంటూ ట్విట్టర్‌లో సందేశమిచ్చింది. ఈ బొద్దుగుమ్మ హన్సిక చేసిన ఈ మంచి పనికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.