సినీ హీరోలు మీసాలు, గడ్డాలు పెంచుకుంటున్నారో లేదో కాని కండలు మాత్రం పెంచుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ కోసం భారీ కసరత్తులు మొదలుపెడుతున్నారు. సినిమాల్లోనే కాదు.. రియల్‌గా కూడా సిక్స్ ప్యాక్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్‌ల్లాగా తమ శరీరాకృతిని మార్చుకుంటున్నారు.
అసలు విషయానికి వస్తే ఇప్పటివరకు మన హీరోలు సిక్స్ ప్యాక్‌లు చేయడం మనం చూసున్నాం.. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ భామ తన సిక్స్ ప్యాక్‌తో అందరిని అబ్బురపరిచింది. ఆ హీరోయిన్ ఎవరని ఆశ్చర్యపోతున్నరా... ప్రముఖ వీడియో జాకి బాణి. ఆమె అస్సలు పేరు "గుర్బాని జడ్జ్". ఈ అందాల ముద్దుగుమ్మ సిక్స్ ప్యాక్ అందానికి హీరోలు ఫిదా అయిపోయారు. ఆ శరీరాకృతికి అందరూ దాసోహమైపోవాల్సిందే.
ఎంటీవీలో యాంకర్‌గా పేరు తెచ్చుకున్నఈ భామ ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ హిమేష్ రేష్మియా హీరోగా వచ్చిన ''తేరా సరూర్ట'' చిత్రంలో హీరోయిన్‌గా నటించి అందరిని మెప్పించింది. అంతేకాకుండా ఈ సిక్స్ ప్యాక్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలని చాలా మంది హీరోలు ఎగబడుతున్నారట. అయితే ఈ బ్యూటీ మాత్రం ఒక్క జాన్ అబ్రహాంతోనే చేస్తానని తేల్చి చెపుతోందట. బయటకు వెళ్ళిన ప్రతీసారి జాన్ ఈ బ్యూటీ వెంట ఉండాల్సిందే అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.