Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాతో కరవు : రకుల్ ప్రీత్ సింగ్ వెంటపడుతున్న కుర్రహీరోలు!

Advertiesment
కరోనాతో కరవు : రకుల్ ప్రీత్ సింగ్ వెంటపడుతున్న కుర్రహీరోలు!
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:42 IST)
కరోనా వైరస్ మహమ్మారితో ఎక్కడి షూటింగులు అక్కడే బంద్ అయిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయి. దీంతో అక్కడక్కడా ఒకటి రెండు షూటింగులు జరుగుతున్నాయి. అదేసమయంలో కరోనా లాక్డౌన్ సమయంలో శ్రద్ధగా ఆలకించిన కథల్లో తమకు నచ్చిన కథలను ఎంచుకుని వాటిని పట్టాలెక్కించేందుకు హీరోలు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే, హీరోయిన్లు సైతం వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 
 
ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా కష్టకాలం తర్వాత బాగా కలిసివచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా కుర్ర హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్‌గా రకుల్‌ను ఎంపిక చేసుకునేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఈ అమ్మడుకి టాలీవుడ్‌లో మూడు సినిమాలు చేతిలో వున్నాయి. వాటిలో ఒకటి వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న చిత్రంలో రకుల్ ఎంపికైంది. 
 
మరోవైపు నితిన్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. అలాగే తెలుగు తేజం కరణం మల్లీశ్వరి బయోపిక్ ఛాన్స్ కూడా రకుల్‌నే వరించినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లపై కూడా రకుల్ దృష్టి సారించింది. ఓ ప్రముఖ దర్శకుడు రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో కూడా రకుల్ కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. నిజానికి కరోనాకు ముందు ఈ అమ్మడుకు సరైన అవకాశాలు లేక బాలీవుడ్‌పై దృష్టిసారించి, ముదురు హీరోలతో కలిసి నటించేందుకు సైతం సిద్ధపడింది. కానీ, కరోనా తర్వాత రకుల్‌కు కలిసిరావడంతో వరుస సినీ ఆఫర్లు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్చ్.. చెల్లిగా నటించాలా? డైలామాలో పడిన నివేదా థామస్?