Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#PSPK25: త్రివిక్రమ్-పవన్ సినిమా టైటిలేంటి? పవర్ స్టార్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్?

అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సూపర్ హిట్ సినిమానిచ్చిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. పవన్‌తో 25వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పవన్ కల్యాణ్ పు

Advertiesment
#PSPK25: త్రివిక్రమ్-పవన్ సినిమా టైటిలేంటి? పవర్ స్టార్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్?
, బుధవారం, 16 ఆగస్టు 2017 (12:36 IST)
అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సూపర్ హిట్ సినిమానిచ్చిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. పవన్‌తో 25వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజున పీకే 25 చిత్రానికి సంబంధించిన లుక్ అవుట్ అవుతుందని సమాచారం. 
 
ఇక ఈ సినిమా కోసం టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఇంజినీర్ బాబు, గోపాల కృష్ణుడు, పరదేశ ప్రయాణం, దేవుడే దిగివచ్చినా, రాజు వచ్చినాడు వంటి పేర్లు షికార్లు చేస్తున్నాయి. వీటిలో ఏ టైటిల్ పెడతారో ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తాడని, సంక్రాంతి 2018కి ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. కీర్తిసురేష్, అను ఇమ్మాన్యువేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాలు రోత రోత.. ఎన్టీఆర్, వైఎస్సార్ గ్రేట్.. సినీ పరిశ్రమ వల్లే డ్రగ్స్ పెరగలేదు