Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లవ్ ప్రపోజ్ చేసిన అబ్బాయిని హర్ట్ చేసి ఫ్రెండ్‌షిప్‌ కట్ చేశా : నటి మాధవీలత

మాధవీలత. కర్ణాటక రాష్ట్రం నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయి. నచ్చావులే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నానితో కలిసి నటించిన ‘స్నేహితుడా’ చిత్రం తర్వాత ఒకట్రెండు సినిమాల్లో కనిపిం

Advertiesment
Madhavi Latha
, సోమవారం, 10 జులై 2017 (12:35 IST)
మాధవీలత. కర్ణాటక రాష్ట్రం నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయి. నచ్చావులే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నానితో కలిసి నటించిన ‘స్నేహితుడా’ చిత్రం తర్వాత ఒకట్రెండు సినిమాల్లో కనిపించి గ్యాప్ తీసుకుంది. అడపాదడపా అవకాశాలు వచ్చినా.. ఆ సినిమాలు విడుదల కాలేదు. మంచి సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అనేక విషయాలపై స్పందించింది.
 
తనకు సినీ అవకాశం రావడంతో హైదరాబాద్‌కు వచ్చాను. ఆ సమయంలో ఒక అబ్బాయితో స్నేహం ఏర్పడింది. నా గురించి చాలా కేర్ తీసుకునేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లవ్ ప్రపోజ్ చేశాడు. ‘నాకు అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. ఇది అందరమ్మాయిలూ చెప్పే మాటే అయినా నేను మాత్రం నిజంగా చెబుతున్నాను. నాకు అలాంటి అభిప్రాయం లేదు.’ అని చెప్పాను. కానీ, తను కూడా చాలా క్లియర్‌గా చెప్పాడు. ‘నీ అభిప్రాయం నీది. నీ ఫీలింగ్ నీది. నేను ఫోర్స్ చేయడానికి ఏమీ లేదు’ అన్నాడు. సరే ఫ్రెండ్‌లా ఉండు అన్నాను.
webdunia
 
కానీ, అతను మాత్రం మరోలా స్పందించాడు. ‘నేను నిన్ను ఫ్రెండ్‌లా చూడను. నేను నిన్ను లవర్‌లానే చూస్తా. నువ్వు ఫ్రెండ్‌లా చూసుకో అది నీ ఒపీనియన్. నీ మనసుని నేను మార్చలేను కదా’ అన్నాడు. అతడిది మంచి అభిప్రాయం. మంచి మాట చెప్పాడు అనుకున్నాను. అలాగే, తను ఎప్పుడూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించలేదు కూడా.
webdunia
 
కానీ, మా ఇద్దరి మధ్య ఉండే స్నేహాన్ని తెగదెంపులు చేసుకునేందుకు ఆ అబ్బాయిని హర్ట్ చేశాను. ఎందుకంటే అలా ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అయితే ఆ అబ్బాయి లవ్ కూడా కంటిన్యూ అవుతుంది కదా. అది నాకు ఇబ్బంది. విడిపోవడానికి తనకు ఇష్టం లేకున్నా నేనే కావాలని తన ఇగో హర్ట్ చేశాను. ఇది చాలా బాధపెట్టే విషయాలు మాట్లాడి కట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవికి సారీ చెప్పిన రాజమౌళి.. పబ్లిక్‌గా చెప్పడం తప్పే.. కానీ అబద్ధం చెప్పలేదు..