Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాలే నా ప్రపంచం... పబ్స్, విదేశాలకు వెళ్లడం నా హాబీ: పూరీ జగన్నాథ్

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో సిట్ అధికారుల బృందం అడిగిన ప్ర

Advertiesment
సినిమాలే నా ప్రపంచం... పబ్స్, విదేశాలకు వెళ్లడం నా హాబీ: పూరీ జగన్నాథ్
, బుధవారం, 19 జులై 2017 (16:44 IST)
హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో సిట్ అధికారుల బృందం అడిగిన ప్రశ్నలతో పూరీ ఉక్కిరిబిక్కిరైనట్టు సమాచారం. 
 
ఈ విచారణలో పూరీ సమాధానమిస్తూ 17 క్రితం తెలుగు సినీ పరిశ్రమకు వచ్చానని, తనకు సినిమానే ప్రపంచమని, సినిమాల కోసమే తన బృందంతో పాటు బ్యాంకాక్ వెళ్తుంటానని చెప్పినట్టు సమాచారం. పబ్స్, విదేశాలకు వెళ్లడం తన హాబీ అని, తనకు బయటి స్నేహితులు చాలా తక్కువ అని, తన సినిమాల్లో ప్రస్తుతం ఉన్న కల్చర్‌ని చూపెడుతుంటానని చెప్పినట్టు వినికిడి. 
 
అయితే, సిట్ విచారణ బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించగా, ఆయన ఏ మాత్రం తడబడకుండా సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పాడట. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్‌లో కెల్విన్‌ను కలిసిన విషయం నిజమేనని ఒప్పుకున్న పూరీ... ఆ తర్వాత తనకు, కెల్విన్‌కు మధ్య రెగ్యులర్‌గా ఎలాంటి సంభాషణలు జరగలేదని చెప్పినట్టు సమాచారం. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేదని టాలీవుడ్ దర్శకుడు చెప్పినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కుమార్తె శరీర కష్టాన్ని నమ్ముకుంది... డ్రగ్స్‌కు బానిస కాదు : చార్మీ తండ్రి