Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijaya Setu: విజయసేతుపై డాక్టర్ రమ్య మోహన్ పెట్టిన పోస్ట్ మళ్ళీ వైరల్ !

Advertiesment
Dr. Ramya mohan, Vijay setupati

చిత్రాసేన్

, శనివారం, 11 అక్టోబరు 2025 (12:56 IST)
Dr. Ramya mohan, Vijay setupati
నటుడు విజయ్ సేతుపతి పై అమెరికాకు చెందిన డాక్టర్ రమ్య మోహన్ ఘాటు విమర్శలు చేశారు. బెంగుళూరు మూలాలకు చెందిన ఈమె తన సోషల్ మీడియా.. ఎక్స్ లోనూ, ఫేస్ బుక్ పేజీలోనూ విజయ్ సేతుపతి వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. విజయ్ సేతుపతి ఉమనైజర్ అంటూ సంచలన ఆరోపణ చేసింది. గత కొద్దిరోజులు వైరల్ అవుతోంది.
 
ఆమె ఇంకా ఏమందంటే.. కోలీవుడ్ లో డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ అనేది జోక్ కాదు. చాలా పెద్ద విషయం. నాకు తెలిసిన ఓ అమ్మాయి మీడియాలో పనిచేస్తుండేది. ఆమెను బలవంతంగా సినిమా ప్రపచంలోకి లాగారు. తను ప్రస్తుతం రీహాబిటేషన్ సెంటర్ లో వుంది. చికిత్స తీసుకుంటోంది. ఇండస్ట్రీ ముసుగులో డ్రెగ్స్, కాస్టింగ్ అనేవి కామన్ గా మారాయి. ఇక విజయ్ సేతుపతి కారవాన్ ఫేవర్ కోసం రెండు లక్షలు, లాంగ్ డ్రైవ్ కోసం యాభై వేలు ఆపర్ చేస్తుంటాడు. పైకి ఆయన సాధువులా కనిపిస్తాడు. ఇదేమీ కథకాదు. ఆ అమ్మాయి డైరీ ఆధారంగా చెబుతున్నానంటూ విజయ్ పై సంచలన ఆరోపణలు చేసింది డాక్టర్.
 
ఇదిలా వుండగా, ఏమైందో ఏమో కానీ డాక్టర్ రమ్య పెట్టిన పోస్ట్.. కొద్దిసేపటి క్రితమే డిలీట్ చేసింది. కానీ అప్పటికీ ఆమె పెట్టిన పోస్ట్ కు చెందిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పలువురు చూపిస్తూ,, డాక్టర్ రమ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఎందుకు డిలీట్ చేశావ్.. అని నిలదీయడంతో.. వెంటనే దానికి రిప్లయి ఇస్తూ, కోపంలో ఆ పోస్ట్ పెట్టాననీ, అది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదని చెబుతోంది. 
 
అంతేగాక బాధితురాలు గోప్యత, శ్రేయస్సు కోసం తాను పోస్ట్ డిలీట్ చేశానని అంటోంది. అయితే, రమ్య మోహన్ అనే డాక్టర్ విదేశాల్లో వుంటుంది. ఆమెకు ఈ విషయాలు ఎవరు చెప్పారు? అనేది ప్రశ్నగా మారింది.  ఇక దీనిపై విజయ్ సేతుపతి.. తను నటించిన సార్ మేడమ్.. సినిమా ప్రమోషన్ లో మీడియాకు సమాధానం చెప్పారు. ఆమె ఎవరో తెలీదు. దానివల్ల నా కుటుంబం చాలా బాధ పడింది. దయచేసి ఇలాంటి ఆరోఫలు చేయడం మానుకోవాలని విన్నవించారు. కానీ మరలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు.
 
సార్ మేడమ్.. సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో చార్మి కౌర్ నిర్మిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Priyanka Mohan: ఎ.ఐ. టెక్నాలజీ దుర్వినియోగంపై మండి పడ్డ ప్రియాంక మోహన్