Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

Advertiesment
Anushka Shetty (Twitter)

దేవీ

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (09:30 IST)
Anushka Shetty (Twitter)
అనుష్క శెట్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ఘాటి మొదట ఏప్రిల్ 18, 2025న విడుదల కావాల్సి ఉంది. అయితే, కొత్త తేదీని ప్రకటించకుండానే నిర్మాతలు అకస్మాత్తుగా విడుదలను వాయిదా వేశారు. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులలో ఆసక్తిలేకుండా పోయిందనే చెప్పాలి.

తాజాగా యంగ్ దర్శకుడు ఓ కథను తీసుకువచ్చి నిర్మాతలకు చెప్పారట. అయితే అది హారో బేస్డ్ కాకుండా హీరోయిన్ బేస్డ్ చేయమని సూచించారు. దానితోపాటు ఘాటి సినిమా విజయంపై నెక్ట్స్ అవకాశం వుంటుందని వెల్లడించారట. మరి అనుష్క శెట్టి ఘాటి బ్రేక్ పడడం పట్ల అసలైన కారణాలు చెప్పకపోయినా సాంకేతికంగా కొద్ది మార్పులు చేయాల్సివుందని టాక్ వినిపిస్తోంది.
 
ఘాటి వాయిదా వేసినప్పటి నుండి, ఒక్క అప్‌డేట్ కూడా షేర్ చేయకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. చిత్ర బృందం నుండి పూర్తిగా కమ్యూనికేషన్ లేకపోవడం సినిమా భవిష్యత్తు గురించి ఊహాగానాలకు దారితీసింది.
 
అనుష్క అభిమానులు కొత్త విడుదల తేదీ కాకపోయినా స్పష్టత కోసం అడుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు, అనుష్క, దర్శకుడు క్రిష్ లేదా UV క్రియేషన్స్ ఈ విషయమై ఏవిధంగానూ స్పందించలేదు. అభిమానులు తమ నిరీక్షణ వృధా కాకూడదని మరియు ఘాటి త్వరలో కొన్ని సానుకూల వార్తలతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి చిత్రం కన్ఫామ్ కానుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ