చిరంజీవి-అల్లు అర్జున్ తండ్రీకుమారులుగా నటిస్తే అదిరిపోదూ.. చిరు 151 సినిమా అదే..
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు 150వ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా అనం
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు 150వ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా అనంతరం చిరు 151 సినిమాలో వీళ్లిద్దరూ నటించబోతున్నారా.. అవుననే టాక్ వినిపిస్తోంది. కాగా కన్నడంలో అంబరీష్, పునీత్ రాజ్ కుమార్ నటించిన చిత్రం ''దొడ్డమానే హుడుగా''. ఈ ఇద్దరు స్టార్లు పోటీపడి నటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్స్ కూడా బాగా హిట్ అయ్యాయి.
ఈ సినిమా బిజినెస్ కూడా బాగా జరిగింది. రిలీజ్‌కు ముందే హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. అలాగే తెలుగులో కూడా ఈ సినిమాని రీ-మేక్ చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అది కూడా మెగా ఫ్యామిలీ నుంచే తీయాలని కొందరు బాగా ప్రయత్నాలు చేస్తున్నారంట. కాగా పునీత్ రాజ్ కుమార్ రోల్‌కి బన్నీ సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే.. అంబరీష్ పాత్రకి మెగాస్టార్ చిరంజీవి బెటర్ అనే ఆలోచన కూడా వచ్చిందని అంటున్నారు. ఇది ఓ తండ్రీకొడుకుల కథ అని.. ఇప్పుడిప్పుడే మాస్ హీరో ఇమేజ్ లోకి వస్తున్న బన్నీకి ఈ స్టోరీ ప్లస్ పాయింట్ అవుతుందనే చర్చ జోరుగా సాగుతుంది. హీరో తండ్రి క్యారెక్టర్ కూడా బలంగా ఉంటుందంట.
హీరో కంటే ఎక్కువగా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందంట. ఈ పాత్ర కోసం చిరంజీవిని నటింపజేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఉన్నారట దర్శకనిర్మాతలు. నిజానికి తెలుగు రీమేక్లో బన్నీ, చిరులు కలిసి నటిస్తే ఆ సినిమా టాలీవుడ్ బిగెస్ట్ మల్టీ స్టారర్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.