Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నం?

టాలీవుడ్ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఈ దారుణానికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షిక

దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నం?
, గురువారం, 20 జులై 2017 (10:41 IST)
టాలీవుడ్ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఈ దారుణానికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఈ వార్తపై ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతుందేగానీ.. స్పందించేందుకు ఏ ఒక్కరూ ముందుకురావడం లేదు. దీంతో ఈ వార్త నిజమో కాదో నిర్ధారణ కావాల్సి వుంది. 
 
వైవీఎస్ చౌదరి స్వర్గీయ ఎన్టీ.రామారావు వీరాభిమాని. ఆయన స్ఫూర్తితోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1998లో "శ్రీసీతారాముల కల్యాణం చూతమురారండి" సినిమాతో దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన వైవిఎస్.... తొలి సినిమాతో మంచి విజయమే అందుకున్నారు. అనంతరం హరికృష్ణ, నాగార్జునలతో తీసిన "సీతారామరాజు" సక్సెస్ కావడంతో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
 
మహేష్ బాబు రెండో సినిమా ‘యువరాజు' చిత్రాన్ని నిర్మించారు. ఆతర్వాత "లాహిరి లాహిరి లాహిరిలో" చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చౌదరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత 'సీతయ్య', 'దేవదాసు' చిత్రాలు కూడా సొంతగా నిర్మించి సక్సెస్ అయ్యారు.
 
కానీ, 2008లో బాలయ్యతో తీసిన ‘ఒక్కమగాడు' చిత్రం చౌదరిని భారీ ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. ఆవెంటనే తన దర్శకత్వంలో మోహన్బాబు నిర్మించిన ‘సలీమ్'కూడా పెద్ద ప్లాప్. ఈ రెండు పరాజయాలతో అటు అర్థికంగా నష్టపోవడం, ఇటు కెరీర్ గ్రాఫ్ కూడా కిందకు పడిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మెగా హీరో వరుణ్ తేజ్‌తో తీసిన రేయ్ చిత్రం చౌదరిని మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకునేలా చేసింది. ఈ ఆర్థిక కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కేందుకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంఘమిత్రలోనూ కట్టప్ప హీరోనే.. సత్యరాజ్ ఇంకా ఓకే చేయలేదా?