Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజిత్‌తో కాజల్ సినిమా.. ఆ పని చేసింది.. దర్శకుడితో అక్షింతలు వేయించుకుంది..

అందాల ముద్దుగుమ్మ కాజల్ చెయ్యకూడని పనిచేసి దర్శకుడితో క్లాస్ పీకించుకుందట. అంత పెద్ద తప్పు ఏం చేసిందబ్బా అని అనుకుంటున్నారా.. ఆ తప్పుకి కారణం షూటింగ్‌కి సరైన సమయంలో రాకపోవడమో లేదా సరిగ్గా నటించకపోవడమో

Advertiesment
director
, గురువారం, 18 ఆగస్టు 2016 (12:13 IST)
అందాల ముద్దుగుమ్మ కాజల్ చెయ్యకూడని పనిచేసి దర్శకుడితో క్లాస్ పీకించుకుందట. అంత పెద్ద తప్పు ఏం చేసిందబ్బా అని అనుకుంటున్నారా.. ఆ తప్పుకి కారణం షూటింగ్‌కి సరైన సమయంలో రాకపోవడమో లేదా సరిగ్గా నటించకపోవడమో కాదు... అసలు విషయం ఏంటాని ఆరా తీస్తే.. నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే... అజిత్ నటిస్తున్న 57వ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. 
 
అయితే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ప్రస్తుతం ఐరోపా దేశంలో జరుగుతుంది. అయితే ఈ భామకు ఓ అలవాటు ఉంది ఏదైనా సినిమాకు సంబంధించి అందులో నటిస్తున్నట్లు లేదా లొకేషన్‌లో ఉన్నట్లయితే దాని తాలూకు ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తుంటుంది. ఈ షూటింగ్ సమయంలో నటి కాజల్ అగర్వాల్ తన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిందట. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 
ఈ సినిమాలో బెంగాల్ బ్యూటీగా నటిస్తున్న కాజల్ న్యూ లుక్‌ని సీక్రెట్‌గా ఉంచాలని భావించిన డైరెక్టర్.. ఆ ఫోటోలు బయటకు వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కాజల్‌కి ఫుల్‌గా క్లాస్ పీకాడట. ఇంకెప్పుడూ ఈ సినిమాకు సంబందించిన ఫోటోలను షూటింగ్ విశేషాలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. దర్శకుడు ముందు వార్నింగ్ ఇచ్చినా తర్వాత కాజల్‌కు సర్ది చెప్పడంతో ఈ ముద్దుగుమ్మ రియలైజ్ అయ్యిందట. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''కాష్మోరా'' ఫస్ట్ లుక్ రిలీజ్.. నయనతార, శ్రీదివ్య హీరోయిన్లు.. కార్తీ లుక్‌తో..