మహేష్ బాబు- మురుగ దాస్ సినిమా: ఎస్‌జే సూర్య-నదియా రొమాన్స్ అదుర్స్!
అత్తారింటికి దారేది చిత్రం ద్వారా తెలుగులో పరిచయమై అద్భుతమైన నటనను కనబరిచిన నటి నదియా. ఈ సీనియర్ నటి కోలీవుడ్ దర్శకుడితో రొమాన్స్ చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే... తమిళ
అత్తారింటికి దారేది చిత్రం ద్వారా తెలుగులో పరిచయమై అద్భుతమైన నటనను కనబరిచిన నటి నదియా. ఈ సీనియర్ నటి కోలీవుడ్ దర్శకుడితో రొమాన్స్ చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే... తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రంలో విలన్‌గా తమిళ దర్శకుడు, హీరో ఎస్ జే సూర్య నటిస్తున్నాడు.
అయితే ఈయనకు జోడీగా నదియాని సెలక్ట్ చేశారు. నదియా పాత్ర ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందని అలాగే సూర్యతో నదియాకు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత నదియా వరుస సినిమాలతో సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌జే సూర్య రొమాన్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని.. తప్పకుండా అమ్మడుకు ఆఫర్లు వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.