చిరంజీవి సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారు : కోదండరామిరెడ్డి
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్‌లో చిరంజీవి యాక్షన్, సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారన్నారు.
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్‌లో చిరంజీవి యాక్షన్, సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారన్నారు.
విజయవాడలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చిరంజీవి యాక్షన్, సందేశాత్మక సినిమాలు తీస్తే జనాలు హేళన చేస్తూ నవ్వుకుంటారని ఆయన చెప్పారు. తానైతే చిరంజీవితో హాస్య చిత్రం తీస్తానన్నారు. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం అలానే ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
నిజానికి చిరంజీవిపై కోదండరామిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇపుడ ఫిల్మ్ నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో చిరంజీవి, కోదండరామి రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన అనేత సినిమాలు అప్పట్లో సూపర్‌హిట్ అయ్యాయి. చిరు ఎక్కువ సినిమాలు ఒకే డైరెక్టర్‌తో తీసిన లిస్ట్‌లో కోదండరామిరెడ్డి అందరికన్నా ముందు వరుసలో ఉంటారు. అలాంటి వ్యక్తి చిరుపై ఇలాంటి కామెంట్స్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.