Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళాభవన్ మణి హత్యలోనూ దిలీప్‌‌కు లింక్?: మమ్ముట్టి ''సిస్టర్'' అంటే కమల్ ''భావన'' అన్నారు..

''జెమిని'' సినిమాతో తెలుగు తెరకు విలన్‌గా పరిచయమైన నటుడు కళాభవన్ మణి హత్య కేసులో కూడా మాలీవుడ్ హీరో దిలీప్ (48)కు ప్రమేయమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భావన కిడ్నాప్ కేసులో అరెస్టయిన దిలీప్‌‌ప

Advertiesment
కళాభవన్ మణి హత్యలోనూ దిలీప్‌‌కు లింక్?: మమ్ముట్టి ''సిస్టర్'' అంటే కమల్ ''భావన'' అన్నారు..
, గురువారం, 13 జులై 2017 (16:23 IST)
''జెమిని'' సినిమాతో తెలుగు తెరకు విలన్‌గా పరిచయమైన నటుడు కళాభవన్ మణి హత్య కేసులో కూడా మాలీవుడ్ హీరో దిలీప్ (48)కు ప్రమేయమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భావన కిడ్నాప్ కేసులో అరెస్టయిన దిలీప్‌‌పై కొత్తగా కళాభవన్ మణి హత్య కేసులో సంబంధమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ఈ మేరకు తన సోదరుడి హత్య కేసులో దిలీప్‌కు సంబంధం ఉందని మణి సోదరుడు రామకృష్ణన్‌, దర్శకుడు బైజు కొట్టారక్కర ఆరోపించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలను సైతం సీబీఐకి అందిచామన్నారు. 
 
భూముల విషయంలో కళాభవన్ మణితో దిలీప్ గొడవపడ్డాడని.. రామకృష్ణన్ సీబీఐకి చెప్పారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, భావన కేసు విషయంలో దిలీప్ అరెస్టు అనంతరం అతని సోదరుడిని విచారించిన పోలీసులు, తాజాగా దిలీప్ తల్లి సరోజమ్మ పిళ్ళైని విచారిస్తున్నారు. త్వరలోనే దిలీప్ భార్య, సతీమణి కావ్య మాధవన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్సుందని.. ఇప్పటికే ఆమె తమ సోషల్ మీడియా అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. భావన కిడ్నాప్ కేసులో దిలీప్ అరెస్టుకు సంబంధించి సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే దిలీప్‌ను మాలీవుడ్ మూవీ అసోసియేషన్ (అమ్మ) బహిష్కరించినట్లు సీనియర్ నటుడు మమ్నుట్టి ప్రకటన చేశారు. ఇంకా భావనను ఆయన సోదరిగా పిలిచారు. ఆమెకు సినీ ఇండస్ట్రీ వెన్నంటి వుంటుందని చెప్పారు. 
 
మరోవైపు దిలీప్-భావన కేసులో భావన పేరును చెప్పకుండా.. బాధిత నటి అని మీడియా పలకడంపై నటుడు కమల్ హాసన్ స్పందించారు. భావన అనే పేరును కిడ్నాప్ కేసుకు సంబంధించి వాడితే తప్పులేదన్నారు. ఆమే ఎంతో ధైర్యంగా తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే.. ఆమె పేరును పలకుండా బాధిత నటి అని పలకడం కరెక్టు కాదన్నారు. భావన అని పిలవడంలో తప్పులేదన్నారు. ఆమెను నటీమణులు.. మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ద్రౌపది ఎలా బాధిత మహిళ అనలేరో.. అలాగే భావనను విక్టిమ్ అనకండని.. ద్రౌపది తరహాలో న్యాయం కోసం పోరాటం చేసిన భావన పేరును మీడియా ఎత్తేయడం కరెక్ట్ కాదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ గోడ దూకారు.. కమల్‌ క్రేజ్ ఢమాల్: జూ.ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ వద్దేవద్దు.. శ్రీముఖి కూడా?