Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవికి చిర్రెత్తుకొచ్చిందట.. లిప్ లాక్ ఒకరితో కౌగిలింత మరొకరితో.. జాహ్నవి ఎవర్ని ప్రేమిస్తున్నట్లు?

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ బాయ్‌ఫ్రెండ్స్ వ్యవహారంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే బాయ్‌ఫ్రెండ్స్‌ను పక్కనబెట్టమంటూ శ్రీదేవి ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. కూతురిపై శ్రీదేవి మ

Advertiesment
DID YOU HEAR THIS: Sridevi Wants Jhanvi To Be The Next Alia!
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (13:02 IST)
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ బాయ్‌ఫ్రెండ్స్ వ్యవహారంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే బాయ్‌ఫ్రెండ్స్‌ను పక్కనబెట్టమంటూ శ్రీదేవి ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. కూతురిపై శ్రీదేవి మళ్లీ మండిపడింది. ఇప్పటికే 19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్‌‌లలో బాయ్‌ ఫ్రెండ్స్‌‌‍తో కలసి లిప్ లాక్‌, కౌగిలింతలతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్‌‌లో పడినట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్‌ శిఖర్‌‌తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్‌‌లో హాట్‌ టాపిక్‌‌గా మారింది. కూతురు ప్రేమకు శ్రీదేవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ సినీ జనాలు భావిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో మరో ట్విస్ట్‌ ఏంటంటే జాహ్నవి అక్షత్‌ రాజన్‌ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో.. శ్రీదేవికి చిర్రెత్తుకొచ్చింది. అక్షత్‌ తన ఇన్‌‌స్టాగ్రామ్‌ పేజీలో జాహ్నవి‌ ముద్దెట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో జాహ్నవి డేటింగ్‌ చేస్తోంది శిఖర్‌ తోనా లేక అక్షత్‌ తోనా? అని బిటౌన్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 
 
దీంతో శ్రీదేవి కూడా ఇంతకీ ఎవరితో డేటింగ్ చేస్తున్నావమ్మా అంటూ సీరియస్‌గా నిలిదీసినట్లు టాక్ వస్తోంది. మరి శ్రీదేవి మాట జాహ్నవి వింటుందో.. సినిమాల్లో అమ్మ పలుకులు విని రాణిస్తుందో.. లేకుంటే బాయ్‌ఫ్రెండ్స్‌తో సరిపెట్టుకుని పెళ్ళి చేసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాక్షిచౌదరికి ''ఆక్సిజన్'' ఇస్తున్న గోపిచంద్.. స్పెషల్ సాంగ్‌లో చిందులు..