Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైలాగ్ కింగ్ సాయికుమార్‌ను చెంపపై లాగిపెట్టి కొట్టిన ఎన్టీఆర్.. ఎందుకబ్బా?

డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా టాలీవుడ్‌లో ఎన్నో పాత్రలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎంతోమంది నటులకు తన గాత్రాన్ని అందించాడు. సుమన్, రాజశేఖర్ ఇలా చాలామం

Advertiesment
Dialogue king saikumar beaten by Sr.NTR
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:56 IST)
డైలాగ్ కింగ్ సాయికుమార్  హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా టాలీవుడ్‌లో ఎన్నో పాత్రలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎంతోమంది నటులకు తన గాత్రాన్ని అందించాడు. సుమన్, రాజశేఖర్ ఇలా చాలామందికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 'జనతా గ్యారేజ్' సక్సెస్ మీట్‌లో మీడియాతో ఆయన ముచ్చటించారు. తన డబ్బింగ్ జీవితం సీనియర్ ఎన్టీఆర్ సినిమాతోనే మొదలైందని, ఆయన కుటుంబంలో దాదాపు అందరితో నటించే అదృష్టం తనకి దక్కిందని సినీనటుడు సాయికుమార్ అన్నారు. 
 
''నా మొదటి డబ్బింగ్ సినిమా దివంగత నటుడు నందమూరి ఎన్టీఆర్ గారితో చేశాను. అలాగే మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఆయనతో కలిసి నటించడమే కాదు, దెబ్బలు కూడా తిన్నానని అన్నారు. బాలయ్యగారితో ''రౌడీ ఇన్‌స్పెక్టర్'', ''సీమసింహం'', ''కళ్యాణరామ్‌తో పటాస్'', ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' సినిమాలలో నటించాను. అలా కుటుంబంలోని దాదాపు అందరి హీరోలతో కలిసి నటించాను. 'జనతా గ్యారేజ్‌'లో చాలామంది గొప్ప నటుల మధ్య నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 
 
ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివగారికి మనస్పూర్తిగా ధన్యవాధాలు తెలియజేస్తున్నాను. నాకు తారక్‌తో సినిమా చేస్తున్నప్పుడు సీనియర్ ఎన్టీ‌ఆర్‌తో కలిసి నటించిన అనుభూతి కలిగిందని అని సాయికుమార్ చెప్పుకొచ్చాడు. పోలీస్ స్టోరీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాకు ఎంత పేరొచ్చిందో, ఒక డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్‌గా నాకు 'జనతా గ్యారేజ్‌'లో అదే రీతిలో పేరొచ్చింది. దానికి కారణం ఏంటంటే నాకు పోలీసులు చాలా మంది అభిమానులున్నారు. టాప్ ర్యాంక్ నుంచి కింద ర్యాంక్ వరకు. నా పోలీస్ స్టోరీ చూసి ప్రభావితమై పోలీసులైన చాలా మంది వ్యక్తులున్నారు అంటూ సాయికుమార్ తన గత అనుభవాలను పంచుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ 150వ చిత్రంలో పంజాబీ సింగర్.. మ్యూజికల్ హిట్ కోసం డీఎస్పీ తంటాలు