జాన్వి హీరోయిన్ కావడం ఖాయం... స్టూటెండ్ ఆఫ్ ది ఇయర్-2లో కరణ్ జోహార్‌తో సినిమా?
బిటౌన్‌లో ప్రస్తుతం శ్రీదేవి కూతురి తెరంగేట్రమే చర్చనీయాంశమైంది. చిట్టిపొట్టి డ్రస్సులతో కనిపిస్తూ.. శ్రీదేవి కూతురు జాన్వి అప్పుడప్పుడు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే జాన్వి తన బాయ్‌ఫ్రెండ
బిటౌన్‌లో ప్రస్తుతం శ్రీదేవి కూతురి తెరంగేట్రమే చర్చనీయాంశమైంది. చిట్టిపొట్టి డ్రస్సులతో కనిపిస్తూ.. శ్రీదేవి కూతురు జాన్వి అప్పుడప్పుడు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే జాన్వి తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్ టు లిప్ కిస్ చేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు అయిన శిఖర్‌తో తన కూతురు డేటింగ్ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే శ్రీదేవి జాన్వికి వార్నింగ్ ఇచ్చిందట.
జాన్వి, శిఖర్ ముద్దుపెట్టుకున్న ఫొటోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న శ్రీదేవి.. కూతురికి కొన్ని కఠినమైన ఆంక్షలు విధించిందని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న జాన్వి అస్సలు యువకులతో స్నేహం చేయవద్దని, డేటింగ్ చేయడం సంగతి దేవుడెరుగు అస్సలు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నా తాను అంగీకరించే ప్రసక్తే లేదని కూతురికి గట్టిగా చెప్పినట్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో జాన్వీ ఎప్పటికైనా హీరోయిన్‌గా మారటం ఖాయమనే చెప్పాలి. అయితే హీరోయిన్‌గా కుమార్తె కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న శ్రీదేవి అందుకోసం బీ-టౌన్‌లోని మూవీ మేకర్‌లను అప్రోచ్ అవుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. స్టూటెండ్ ఆఫ్ ది ఇయర్-2లో జాన్వి నటించటం ఖాయమని రూమర్స్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయ్. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవన్నీ ఎలా ఉన్నా తాజాగా ఎంట్రీ ఇవ్వబోతున్నది ఓ మరాఠీ సినిమా రీమేక్‌తో అని న్యూస్ వినిపిస్తోంది. మరాఠీలో కేవలం రూ.4కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా వంద కోట్లు వసూలు చేసిన సైరాట్ మూవీ బాలీవుడ్ రీమేక్‌లో జాన్వీ నటించబోతోందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు చెందిన బాలీవుడ్ రైట్స్‌ను ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. జాన్వీని దృష్టిలో పెట్టుకునే కరణ్ ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.