మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తమిళంలో విజయం సాధించిన 'కత్తి' చిత్రం రీమేక్‌ని తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో చిరు నటించబోతున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించబోతున్నాడు.
రామ్ చరణ్ సొంత బ్యానర్‌తో పాటు, లైకా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో చిరు చేయబోతున్న సినిమాకి భారీ పారితోషికం తీసుకోబోతున్నాడు. ''కత్తి'' సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్న చిరంజీవి 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అందుకు నిర్మాతలు కూడా సై అంటున్నారట. అడ్వాన్స్‌గా 15 కోట్లు ఆయనకి అందనున్నట్టు సినీనిపుణులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్‌కు ఉన్న ఫాలోయింగ్, ఆయన 150 సినిమా మీద ఉన్న అంచనాలు, చాలాకాలం తరువాత చిరంజీవి నటిస్తోన్న సినిమా కావడంతో, భారీ వసూళ్లు ఉంటాయనే బలమైన నమ్మకంతో నిర్మాతలు వున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.