Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మి పనైపోయిందా..! సినీ ఛాన్సులు రాకపోవడానికి అదే కారణమా?

బ్రహ్మానందం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనంటే తెలియని వారండరు. ఏ హీరో సినిమా అయినా బ్రహ్మానందం పక్కన కమెడియన్‌గా ఉండాల్సిందే. అస్సలు ఒకానొక సమయంలో బ్రహ్మానందంను చూసేందుకే అభిమానులు థియేటర్ల వద్దకు వచ్చేవ

బ్రహ్మి పనైపోయిందా..! సినీ ఛాన్సులు రాకపోవడానికి అదే కారణమా?
, శుక్రవారం, 9 జూన్ 2017 (12:05 IST)
బ్రహ్మానందం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనంటే తెలియని వారండరు. ఏ హీరో సినిమా అయినా బ్రహ్మానందం పక్కన కమెడియన్‌గా ఉండాల్సిందే. అస్సలు ఒకానొక సమయంలో బ్రహ్మానందంను చూసేందుకే అభిమానులు థియేటర్ల వద్దకు వచ్చేవారు. ఈయన ముద్దు పేరు బ్రహ్మి. తెరపై కనిపించేంత మృదుస్వభావుడు కాదు బ్రహ్మానందం. బయట ఆయనో రెబల్. క్రమశిక్షణకు మారుపేరు. ఇంటిలో కూడా బ్రహ్మానందం అంటే చాలా భయం మరి.
 
బ్రహ్మానందంకు తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా వెయ్యి సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో జన్మించిన బ్రహ్మానందం అలా... అలా నాటకాలు వేస్తూ సినీ తెరపైకి వచ్చేశారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న బ్రహ్మి ఆ తర్వాత తిరుగులేని కమెడియన్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009 సంవత్సరంలో పద్మశ్రీ దక్కించుకున్నారు. ఇలా ఒక్కటి కాదు బ్రహ్మానందం గురించి చెప్పుకుంటే పోతూ సమయం సరిపోదు.. పేజీలు దానికథే నిండిపోతాయి. 
 
బ్రహ్మి గారు మా కన్నా మీరు చేసే యాక్టింగ్‌ను చూడడానికే జనం పరుగులు తీస్తున్నారు అంటూ అగ్రహీరోలే అసూయ చెందేలా ఉంటుంది బ్రహ్మి క్యారెక్టర్.. అయితే ఈ మధ్య కాలంలో బ్రహ్మి సరిగ్గా కనిపించడం లేదు. ఆయనకు సినిమా ఛాన్సులు రావడం లేదు. కారణం గతంలో కొంతమంది క్రిందిస్థాయి కమెడియన్లను బ్రహ్మి చాలా హీనంగా మాట్లాడడమే. ఎవరు పడితే వారు సినీపరిశ్రమలోకి వచ్చేస్తున్నారని, సినిమా షూటింగ్‌లోనే బహిరంగంగా బ్రహ్మానందం చెప్పారట. కొత్తగా వస్తున్న కమెడియన్లను అస్సలు బ్రహ్మి దగ్గరకు కూడా చేర్చరట. ఇలా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బ్రహ్మానందం చివరకు సినీపరిశ్రమకే దూరమైపోతున్నారు. బ్రహ్మి దూరమవ్వడంకాదు ఆయన్ను చాలామంది సినిమా అవకాశాలు ఇవ్వడం లేదు కాబట్టి. 
 
బ్రహ్మానందం కన్నా ఎక్కువగా నటించే వాళ్ళు.. తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే దర్సక, నిర్మాతలు వారిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందులోనూ బ్రహ్మానందం నటిస్తే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నంతా దృష్టిలో ఉంచుకున్న దర్శక, నిర్మాతలు బ్రహ్మి అవకాశం ఇవ్వడం మానేశారట. అప్పుడప్పుడు తళుక్కుమంటూ ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తూ సినీపరిశ్రమలో ఉన్నానంటే ఉన్నానని సైలెంట్‌గా ఉంటున్నాడట బ్రహ్మానందం. అంతేకాదు ఏదైనా కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ వారి నుంచి ఎంతో డబ్బులు తీసుకుని ఆ కార్యక్రమానికి వెళ్ళి వచ్చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.80 లక్షలిస్తే అలా నటిస్తా.. ఎవరు..?