Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో 'అభినేత్రి'.. ఫరా ఖాన్ ప్రధాన పాత్రధారి...

Advertiesment
Bollywood
, గురువారం, 2 జూన్ 2016 (12:16 IST)
దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరు తమన్నా. పాలబుగ్గల తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ''అభినేత్రి'' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతుంది. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ లేడీ ఓరియంటడ్ సినిమాను ప్రభుదేవా, కోన వెంకట్ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మూడు భాషల్లో చిత్రీకరించబడుతుంది. 
 
అంతేగాక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ అయిన ఫరా ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. కోన వెంకట్ తన ట్విట్టర్‌లో ''ఫరా ఖాన్ ఈ చిత్రంలో తనంతట తానే నటిస్తుంది'' అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ చిత్ర ఆడియో తమన్ -జి.వి.ప్రకాష్ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందించబడుతుంది. 
 
ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ జూన్ 3న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు తెలిపారు. తమన్నా తన కెరీర్లో చేస్తోన్న మొదటి లేడీ ఓరియంటడ్ సినిమా కావడంతో ''అభినేత్రి''పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. సోనూసూధ్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు - నాగ్‌ - అల్లులతో సెల్ఫీ దిగిన సచిన్.. సోషల్ మీడియాలో హైలెట్