Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడితో పడక సుఖం కోసం కుమార్తెకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిన బాలీవుడ్ నటుడి భార్య!

కన్న కూతురిపట్ల ఓ తల్లి చాలా దారుణంగా ప్రవర్తించింది. ఈ తల్లి చేసిన పనికి సభ్యసమాజమే తలదించుకుంటుంది. డ్రగ్స్‌కు బానిసగా చేసి ఆ కూతుర్ని నానా హింసలు పెట్టింది. ఎట్టకేలకు ఆ కర్కశపు తల్లి బారి నుంచి ఆ బ

ప్రియుడితో పడక సుఖం కోసం కుమార్తెకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిన బాలీవుడ్ నటుడి భార్య!
, బుధవారం, 22 జూన్ 2016 (12:52 IST)
కన్న కూతురిపట్ల ఓ తల్లి చాలా దారుణంగా ప్రవర్తించింది. ఈ తల్లి చేసిన పనికి సభ్యసమాజమే తలదించుకుంటుంది. డ్రగ్స్‌కు బానిసగా చేసి ఆ కూతుర్ని నానా హింసలు పెట్టింది. ఎట్టకేలకు ఆ కర్కశపు తల్లి బారి నుంచి ఆ బాలిక బయటపడింది. ఆ నరకం నుండి బయటపడిన ఆ బాలిక తనపై తల్లి జరిపిన దారుణాలను పోలీసుల ముందు వెల్లడించింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ ఘటన ముంబైలోని అంథేరిలో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే... బాలీవుడ్ సినిమాల్లో 1990వ స్టార్ హీరోగా వెలుగొందిన ఒక నటుడు... కాలక్రమేణా అవకాశాలు రాకపోవడంతో క‌నుమ‌రుగ‌య్యాడు. కాగా ఆ న‌టుడు తన భార్య నుంచి విడిపోయి ఏడు సంవత్సరాలైంది. ఆమెకు అప్పటికే ఇద్దరితో పెళ్లయ్యి వారి నుండి విడాకులు తీసుకుంది. ఈ స్టార్ హీరోను పెళ్లి చేసుకున్న ఆమె అత‌డి నుంచి కూడా విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. అయితే ఈ దంపతులకు 15 సంవ‌త్స‌రాల కూతురు ఉంది. తండ్రి లేని కూతురిని కడుపులో దాచుకోవాల్సిన త‌ల్లి అడ్డదారులు తొక్కి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
అతనితో సహజీవనం చేస్తూ స్కూల్‌కు పంపాల్సిన త‌న కుమార్తెను పంపకుండా అతిదారుణంగా హింసించింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు సంవత్సరాలుగా చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చింది. ప్రియుడి సాయంతో ఆమెకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి దారుణంగా ప్రవర్తించింది. ఈ మత్తు ఇంజెక్షన్ల ప్రభావంతో ఆమె రోజుకు 20 నుంచి 22 గంటలు నిద్రపోయేది. తన తల్లి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించిన విఫలైమంది. మొత్తానికి తన స్నేహితుల సహాయంతో గత నెల 29న ఈ యువతి ఆమె తండ్రి వద్దకు చేరుకుని జరిగిందంతా చెప్పేసింది. దీంతో పోలీసులు తల్లి, ప్రియుడిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్సీ స్పాట్స్ చూడతరమా? ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో క్యాథరిన్ థెరిసా ఎద అందాలు అరహో..