అనుపమ పరమేశ్వరన్ వేదాంతం చెప్పడం ప్రారంభించింది. సినిమా అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆమె వేదాంత ధోరణిలో మాట్లాడుతోందని స్నేహితులే చెప్పేస్తున్నారు. అయితే ఆమె చెబుతున్న వేదాంతంలో మంచి విషయాలు కూడా అర్థం చేసుకోవాలంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ అనుపమ ఎందుకు ఇలా మాట్లాడుతోంది?
సినిమాల్లో ఎలా చెయ్యాలో డైరెక్టర్ చెబుతారు. ఆయన చెప్పినట్లు మనం నటించాల్సి ఉంటుంది. అలాగే చేస్తాను కూడా. కానీ కొంతమంది సినిమా యూనిట్లో ఉన్న వారు అమ్మా.. నువ్వు ఇలా చేయకూడదమ్మా.. అలా చెయ్యాలి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు డైరెక్టర్‌కు బాగా దగ్గర అయ్యుండచ్చు. కానీ నేను డైరెక్టర్ మాట మాత్రమే వింటాను.
ఇంకెవరి మాట వినను అంటోంది అనుపమ. అందంతో పాటు కోపం అనుపమకు ఎక్కువే అన్న డైరెక్టర్లు లేకపోలేదు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి తల్లిదండ్రులు చెబితే వింటాను కానీ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సలహాలిస్తే మాత్రం అనుపమకు చిర్రెత్తుకొస్తుందట. అందుకే అనుపమతో స్నేహితులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారట.