తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు నియమితులయ్యారంటూ ఉత్తుత్తి పుకార్లు!
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా సీనియర్ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు నియమితులయ్యారంటూ పుకార్లు విస్తృతంగా వ్యాపించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఇవి ప్రముఖంగా వచ్చాయి. కానీ
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా సీనియర్ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు నియమితులయ్యారంటూ పుకార్లు విస్తృతంగా వ్యాపించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఇవి ప్రముఖంగా వచ్చాయి. కానీ, ఇవన్నీ నిరాధారమైన వార్తలని భారతీయ జనతా పార్టీ వర్గాలు స్పష్టంచేశాయి.
తమిళనాడు గవర్నర్‌గా కె.రోశయ్య పదవీకాలం ముగియడంతో మహారాష్ట్రకు గవర్నర్‌గా ఉన్న సీహెచ్. విద్యాసాగర్ రావు తమిళనాడుకు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగడంతో అంతా నిజమేనని భావించారు. అయితే, దీనిపై బీజేపీ వర్గాల వద్ద ఆరా తీయగా, ఇవన్నీ కేవలం ఉత్తుత్తి పుకార్లేనని స్పష్టం చేశాయి.