Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రియకు బాలయ్య బంపర్ ఆఫర్....

నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతూ వుండటంతో ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు తన తదుపరి చిత్రంపైన ఫోక

శ్రియకు బాలయ్య బంపర్ ఆఫర్....
, సోమవారం, 16 జనవరి 2017 (15:23 IST)
నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతూ వుండటంతో ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు తన తదుపరి చిత్రంపైన ఫోకస్ పెట్టారు. రైతు చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరా అని ఆలోచన చేస్తుండగా ఆ ఆఫర్ శ్రియకు ఇవ్వాలని బాలయ్య నిర్ణయించారట. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీకి చెప్పినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
 
బాలయ్య 151వ చిత్రం రైతులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన డేట్స్ కోసం బాలయ్య వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రియకు ఈ ఆఫర్ ఇవ్వనున్నారనే ప్రచారంతో గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ సెంటిమెంటుతోనే బాలయ్య ఈ ఆఫర్ ఇచ్చారని అనుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రియకు బాలయ్య మరో ఛాన్స్.. 'శాతకర్ణి' షూటింగ్‌లో అంతగా సహకరించిందట!