Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రియకు బాలయ్య మరో ఛాన్స్.. 'శాతకర్ణి' షూటింగ్‌లో అంతగా సహకరించిందట!

నిన్నమొన్నటివరకు అవకాశాల కోసం వెంపర్లాడిన సీనియర్ నటి శ్రియ. ఈ అమ్మడు అదృష్టం "గౌతమిపుత్ర శాతకర్ణి"తో మారిపోయింది. దీనికి కారణం.. ఈ చిత్రంలో శ్రియ నటన అద్భుతమట. అందుకే ఆ చిత్ర హీరో బాలకృష్ణ ఈ అమ్మడుకు

శ్రియకు బాలయ్య మరో ఛాన్స్.. 'శాతకర్ణి' షూటింగ్‌లో అంతగా సహకరించిందట!
, సోమవారం, 16 జనవరి 2017 (15:09 IST)
నిన్నమొన్నటివరకు అవకాశాల కోసం వెంపర్లాడిన సీనియర్ నటి శ్రియ. ఈ అమ్మడు అదృష్టం "గౌతమిపుత్ర శాతకర్ణి"తో మారిపోయింది. దీనికి కారణం.. ఈ చిత్రంలో శ్రియ నటన అద్భుతమట. అందుకే ఆ చిత్ర హీరో బాలకృష్ణ ఈ అమ్మడుకు మరో అవకాశం ఇవ్వనున్నారు. ఫలితంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' కాంబినేషన్ మరోమారు పునరావృతం కానుంది.
 
సినీ నటుడు బాలకృష్ణ 101వ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందులో బాలయ్య రైతుగా నటించనున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియను తీసుకోవాల్సిందిగా బాలయ్య సిఫారసు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 'మనం' మూవీలో నాగార్జునతో కలిసి నటించిన శ్రియ.. అమాయక పల్లెటూరి పిల్లగా బాగా చేసిందన్న కాంప్లిమెంట్ కూడా పొందేసింది. మరి రైతు భార్యగా శ్రియ రెడీ అయినట్లేనా? కాగా, బాలయ్యతో శ్రియ చెన్నకేశవరెడ్డి చిత్రంలో జోడీగా నటించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వా?.. నేనా? ఓవర్సీస్‌లో కలెక్షన్లు కుమ్మేస్తున్న చిరంజీవి 'ఖైదీ' - బాలకృష్ణ 'శాతకర్ణి'