Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వా?.. నేనా? ఓవర్సీస్‌లో కలెక్షన్లు కుమ్మేస్తున్న చిరంజీవి 'ఖైదీ' - బాలకృష్ణ 'శాతకర్ణి'

టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణల సంక్రాంతి సందడి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కొనసాగుతోంది. ఈ సంక్రాంతి సందడితో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఈ సందడితో ఒకవ

నువ్వా?.. నేనా? ఓవర్సీస్‌లో కలెక్షన్లు కుమ్మేస్తున్న చిరంజీవి 'ఖైదీ' - బాలకృష్ణ 'శాతకర్ణి'
, సోమవారం, 16 జనవరి 2017 (12:37 IST)
టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణల సంక్రాంతి సందడి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కొనసాగుతోంది. ఈ సంక్రాంతి సందడితో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఈ సందడితో ఒకవైపు ఫ్యాన్స్... మరోవైపు నిర్మాతలు ఆనందతాండవం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలృకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి'లు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. 
 
ఈ రెండు చిత్రాలు ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, తమిళనాడు, ఒరిసా, మహారాష్ట్రలో పాటు ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో చిరంజీవి చిత్రం 2 మిలియన్ డాలర్ల‌ని కుమ్మేయగా, బాలకృష్ణ వన్ మిలియన్ డాలర్లని దాటేశాడు. ఈజోరు ఇంకా సాగేలా ఉంది. 
 
కాగా, చిరంజీవికి అచ్చొచ్చిన సెంటిమెంట్ టైటిల్ 'ఖైదీ'. ఈ పేరుతో వచ్చిన సినిమాలు ఒకప్పుడు బ్లాక్ బ్లస్టర్ హిట్లే. దశాబ్దకాలం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' రిమేక్‌గా 'ఖైదీ నెంబర్ 150' వచ్చింది. ఈ చిత్రం అంచనాలు మించి బ్లాక్ బ్లస్టర్ అయ్యింది. చిరంజీవి దశాబ్దకాలం తర్వాత నటించిన చిత్రం కావడంతో ఆ సినిమాని చూడటానికి ప్రతి ఒక్కరూ అమితాసక్తిని కనబరుస్తున్నారు. దానికితగ్గట్లుగా రైతుల సమస్యలతో ఎంటర్‌టైన్మెంట్‌ని జోడించి తీయడంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. 
 
ఇకపోతే.. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి మహనటులు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు ఆయన ప్రాణం పోశారు. బాలకృష్ణ తన 100వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి ప్రతిష్టాత్మక చిత్రంతో అభిమానుల ముందుకొచ్చారు. ఈ చిత్రం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిచెప్పిన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణిది కావడం మరోవిశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని నేను లోకల్ ట్రైలర్ రిలీజ్.. అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు చదివితే మార్చి.. అదే అబ్బాయి?