Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

6న వెంకటేష్ - నయనతారల 'బాబు బంగారం' టీజర్

Advertiesment
Babu Bangaram
, గురువారం, 2 జూన్ 2016 (13:20 IST)
విక్టరీ వెంకటేష్ హీరోగా, నయనతార హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాబు బంగారం'. వెంకటేష్ - నయనతార గతంలో కలిసి నటించిన 'లక్ష్మి', 'తులసి' వంటి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ మరోసారి హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటున్నారు. 'గోపాల‌ గోపాల' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని విక్ట‌రి వెంక‌టేష్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ ఓ కామెడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పోషిస్తున్నాడు. 
 
ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''ఉత్తమ విలన్'' వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. కాగా ''భలే భలే మగాడి వోయ్'' చిత్రం తర్వాత మాంచి ఊపుమీదున్న మారుతీ ఈ చిత్రాన్ని అంతకంటే ఫుల్లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. 
 
అయితే ఇప్పటివరకు రెండు పోస్టర్స్ మాత్రమే విడుదల చేసిన యూనిట్ ఈ నెల 6న ఈ సినిమా టీజర్ విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు పోస్టర్స్‌లో వెంకీ లుక్ అదుర్స్ అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇకపోతే ఈ కథ వినగానే మిగతా సినిమాలను పక్కన పెట్టి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకీ.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులైలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మీ గౌతమ్ కొత్త ప్రయోగం.. ముఖానికి సర్జరీ కోసం అమెరికాకు సెక్సీ యాంకర్!