Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబుతో ట్రైన్ సీన్‌లో నటించింది. కానీ నో యూజ్.. బాబు బాగా బిజీతో.. బిజీ బిజీ అయిపోతుందా?

బాబు బాగా బిజీ ద్వారా బాగా అందాలు ఆరబోసిన బోల్డ్ నటికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చేయని రిస్క్ దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల చేశాడు. బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట

Advertiesment
Babu Baga Busy
, శనివారం, 13 మే 2017 (10:00 IST)
బాబు బాగా బిజీ ద్వారా బాగా అందాలు ఆరబోసిన బోల్డ్ నటికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చేయని రిస్క్ దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల చేశాడు. బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్‌గా తెరకెక్కిన 'హంటర్' చిత్రాన్ని తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు శ్రీముఖి, తేజస్విని మడివాడ, మిస్త్రీ, సుప్రియ చాలా హాట్ హాట్‌గా నటించారు. 
 
తొలుత ఈ సినిమాపై విమర్శలు వస్తున్నా.. అవన్నీ ఏమాత్రం అవసరాల పట్టించుకోకుండా ఏప్రిల్ 5న రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించిన ఏ నటులకు పెద్దగా పేరు రాలేదు కానీ బోల్డ్‌గా కుర్రకారుకి మత్తెక్కించేలా నటించిన సుప్రియకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది.
 
బాబు బాగా బిజీ సినిమాతో ఒక్కసారిగా తెరపై వేడి పుట్టించింది. గతంలో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైనా అంతగా గుర్తింపు నోచుకోలేదు సుప్రియ. తాజాగా బాబు బాగా బిజీలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. బాబు బాగా బిజీ ప్లాప్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం భారీగా వస్తున్నాయి.

గతంలో సుప్రియ ఐసోలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించింది. మహేశ్‌బాబుతో కలిసి ట్రైన్ సీన్‌లో నటించింది. చిన్న సీన్‌లో కనిపించిన సుప్రియకు తగిన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్