Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె నా భార్య... కాబోయే భార్య వివరాలు లీక్ చేసిన హీరో ప్రభాస్?

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్స్‌లలో హీరో ప్రభాస్ ఒకడు. 'బాహుబలి' చిత్రం కోసం తన పెళ్లిని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ త్వరలో ముగియనుంది. దీంతో తన పెళ్లికి సంబంధించిన వ

Advertiesment
Baahubali hero Prabhas
, ఆదివారం, 4 డిశెంబరు 2016 (14:11 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్స్‌లలో హీరో ప్రభాస్ ఒకడు. 'బాహుబలి' చిత్రం కోసం తన పెళ్లిని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ త్వరలో ముగియనుంది. దీంతో తన పెళ్లికి సంబంధించిన వార్తలను లీక్ చేస్తున్నాడు. 
 
తన భార్య గురించి తన స్నేహితులతో ఈమధ్య ఒక పార్టీలో కొన్ని విషయాలు లీకులు ఇచ్చాడు అన్న ప్రచారం మళ్ళీ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా కొన్ని మాటలకు చాల ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
 
తనకు కాబోయే భార్య వైజాగ్‌లో స్థిరపడిన చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అని ఆ అమ్మాయి తనకు బాగా నచ్చిందని ప్రభాస్ తన స్నేహితులతో చెప్పినట్లు టాక్. తనకు కాబోయే భార్య బాగా చదువుకుందని అదేవిధంగా ఆమె వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందన్నారు. 
 
తనకోసం గత మూడు సంవత్సరాలుగా ఆ అమ్మాయి వెయిట్ చేస్తోందని చెపుతూ నిశ్చితార్థం అయిన తర్వాతే ఆమె గురించి పూర్తి వివరాలు చెబుతానని ప్రభాస్ తన స్నేహితులతో అన్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఆమె పేరు, ఫోటో బయటపెడితే ఆ అమ్మాయి కుటుంబానికి అసౌకర్యంగా మారుతుందనే ఉద్దేశ్యంతో తాను ఇలా రహస్యం కొనసాగిస్తున్నట్లుగా ప్రభాస్ కామెంట్ చేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మళ్ళీ పెళ్ళి వార్తల సందడి ప్రారంభం అయిందనే అనుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు - బాలయ్యతో పోటీ వద్దు.. 'నమో వేంకటేశాయ'ను ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం : నాగార్జున