Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాహుబలి 2' ఫీవర్ : హెచ్‌పి గ్యాస్ కనెక్షన్‌ తీసుకుంటే బాహుబలి టికెట్ ఫ్రీ

దేశవ్యాప్తంగా 'బాహుబలి 2' ఫీవర్ కొనసాగుతోంది. ఈ ఫీవర్ స్వదేశీయంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 9 వేల థియేటర్లలో విడుదలవుతుంది. ఓవర్సీస్‌లో మరో 2500 స్క్రీన్‌లలో

Advertiesment
'బాహుబలి 2' ఫీవర్ : హెచ్‌పి గ్యాస్ కనెక్షన్‌ తీసుకుంటే బాహుబలి టికెట్ ఫ్రీ
, గురువారం, 27 ఏప్రియల్ 2017 (09:41 IST)
దేశవ్యాప్తంగా 'బాహుబలి 2' ఫీవర్ కొనసాగుతోంది. ఈ ఫీవర్ స్వదేశీయంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 9 వేల థియేటర్లలో విడుదలవుతుంది. ఓవర్సీస్‌లో మరో 2500 స్క్రీన్‌లలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో తొలి పది రోజుల పాటు అన్ని థియేటర్లలో అన్ని టిక్కెట్లు బుక్ అయిపోయాయి. 
 
అదేసమయంలో బాహుబలి 2 చిత్రానికి ఉన్న క్రేజ్‌ను పలు వ్యాపార సంస్థలు కూడా అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఓ గ్యాస్ ఏజెన్సీ ఏకంగా సంచలన ప్రకటన చేసింది. వంట గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి బాహుబలి-2 సినిమా టికెట్‌ను ఉచితంగా ఇస్తామంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని హెచ్‌పీ గ్యాస్ డీలర్ ఇన్‌సాన్ గ్యాస్ ఏజెన్సీ ఈ బంపరాఫర్ ప్రకటించింది.
 
అంతేకాదు ఈ విషయాన్ని తెలుపుతూ పెద్దపెద్ద బ్యానర్లు, కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఏప్రిల్ 30లోపు కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని మెలిక పెట్టింది కూడా. దుగ్గిరాల, రేవేంద్రపాడు గ్రామాల్లోని సినిమా హాళ్లలో ప్రదర్శితమయ్యే సినిమా టికెట్లను కనెక్షన్‌తోపాటు ఉచితంగా ఇవ్వనున్నట్టు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాస్ తెలిపారు. దీంతో పలువురు సినీ అభిమానులు గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు క్యూకట్టడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా'లో ఏముంది... సెన్సార్ ప్రాబ్లమ్స్...