ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బాహుబలి సీక్వెల్‌గా 'బాహుబలి 2' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తెలుగు సినిమా స్థాయినే కాదు ఇండియన్ సినిమా స్టామినాను చాటి చెప్పిన 'బాహుబలి' సినిమా మొదటి పార్ట్‌కే అభిమానులు దాసోహమైపోయారు. 'బాహుబలి 2' చిత్రాన్నిఎలాగైనా 2017 ఏప్రిల్ 14లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ హాలీవుడ్ సినిమా టెన్షన్ పెడుతోంది. ఆ సినిమానే అవతార్. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే హాలీవుడ్ సినిమా అవతార్ కూడా పార్ట్ 2 రెడీ అవుతోంది.
జేమ్స్ కామెరూన్ ఆ సినిమా రెండో పార్ట్‌ను కూడా అంతే అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు. అవతార్ మొదటి పార్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు 'బాహుబలి 2', 'అవతార్ -2' ఓకేసారి రిలీజ్ అయ్యే పరిస్థితులు కనబడడంతో అటు సినీ అభిమానులకు, ఇటు సినీ నిపుణులకు టెన్షన్ మొదలవుతోంది.
దీంతో అవతార్ బాహుబలి కి గట్టి పోటీనిచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. మొత్తానికి 'అవతార్-2', 'బాహుబలి-2' కి కలెక్షన్లకు గండి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.