Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్ 7 డేస్... 15 ఆఫర్స్.. నెగెటివ్ రోల్స్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి స్టార్ హీరో

అరవింద్ స్వామి. 'రోజా' చిత్రంతో మంచి పాపులర్ అయిన హీరో. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. కానీ, సరైన అవకాశాలు లేక వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ పరిస్థితుల్లో కోలీవుడ్‌లో అతని దశను మార్చింది.

జస్ట్ 7 డేస్... 15 ఆఫర్స్.. నెగెటివ్ రోల్స్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి స్టార్ హీరో
, సోమవారం, 12 డిశెంబరు 2016 (21:12 IST)
అరవింద్ స్వామి. 'రోజా' చిత్రంతో మంచి పాపులర్ అయిన హీరో. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. కానీ, సరైన అవకాశాలు లేక వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ పరిస్థితుల్లో కోలీవుడ్‌లో అతని దశను మార్చింది. లేటు వయసులో అతనికి వస్తున్న ఆఫర్లు చూసి కుర్ర హీరోలతో పాటు.. స్టార్ హీరోలు దిమ్మతిరిగి పోతోందట. తమిళ చిత్రం 'తనీ' ఒరువన్ చిత్రంలో ఈ హీరో విలన్ పాత్రలో నటించి ఆ చిత్రంలో నటించిన హీరో కంటే మంచి మార్కులు కొట్టేశాడు. 
 
అయితే అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కానీ 'తనీ ఒరువన్' మూవీని తెలుగులో 'ధృవ'గా రిమేక్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో రిలీజ్ అయిన 'ధృవ' మూవీకి ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ రెస్సాన్స్ వస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన కంటే హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామికే ఎక్కువు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. 'ధృవ'లో సిద్ధార్థ్ అభిమన్యు అన్న నెగటివ్ రోల్‌లో అరవింద్ స్వామి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
 
దీనిపై స్పందిస్తూ... "నన్ను మళ్ళీ ఇంత బాగా ఆదరిస్తోన్నందుకు, సినిమాకు ఇంత పెద్ద విజయం తెచ్చిపెట్టినందుకు తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్" అని అన్నారు. ఇక ఈ మూవీ విజయం గురించి కాస్త పక్కన పెడితే. ఈ మూవీ కారణంగా అరవింద్ స్వామికి తెలుగులో 15 క్రేజీ ఆఫర్స్ వరించాయి. అన్నీ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలే. ఇదంతా కేవలం 7 రోజులు వ్యవధిలో వచ్చిన ఆఫర్స్ కావటం విశేషంగాఉంది. 'ధృవ' మూవీ రిలీజ్ కంటే ముందుగా ఇండస్ట్రీ నుంచి అరవింద్ స్వామికి ఆఫర్స్ వెల్లువ మొదలైంది.
 
11వ తారీఖు వరకూ అరవింద్ స్వామికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆఫర్స్ దాదాపు 15 వరకూ ఉన్నాయి. అయితే ఇందులో అరవింద్ స్వామి ఇప్పటికే 3 మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మిగతా మూవీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇండస్ట్రీ నుండి తెలుస్తున్న సమాచారం. ఇక 'ధృవ' సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించగా, ఈనెల 9వ తేదీన విడుదలై దుమ్మురేపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం... భయపడ్డా : శృతిహాసన్