Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త విజయ్‌తో అమలాపాల్ విడిపోవడానికి సమంతనే కారణమట.. ఎందుకో తెలుసా?

అమలాపాల్.. ఢిల్లీ డిజైనర్ ఏఎల్ విజయ్‌తో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, వీరి ప్రేమ పెళ్లి ఎక్కువ రోజులు కొనసాగలేదు. తమ ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు

Advertiesment
Amala Paul
, సోమవారం, 25 జులై 2016 (16:43 IST)
అమలాపాల్.. ఢిల్లీ డిజైనర్ ఏఎల్ విజయ్‌తో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, వీరి ప్రేమ పెళ్లి ఎక్కువ రోజులు కొనసాగలేదు. తమ ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణం కూడా ఇపుడు వెలుగులోకి వచ్చింది.
 
తమిళ స్టార్ హీరో ధనుష్‌ చిత్రం ‘వడ చెన్నై’లో సమంత హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ తర్వాత ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఎందుకంటే టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యతో పెళ్లి కోసమే సమంత సినిమాలు వదులుకుంటోందనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సమంత స్థానంలో అమలాపాల్‌ను ధనుష్ ఎంచుకున్నాడు. ఆ సూచన కూడా సమంతే చేసినట్టు సమాచారం. 
 
నిజానికి వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు మీద అమలను వివాహం చేసుకున్న విజయ్‌కు.. ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం నచ్చలేదట. ముఖ్యంగా ఈ ‘వడ చెన్నై’ సినిమా విషయంలోనే వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయట. 
 
దీంతో ఎప్పటి నుంచో విడివిడిగా ఉంటున్న ఈ దంపతులు పూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి పరోక్షంగా సమంతే కారణమైనట్టు అయింది. ఆ సినిమా సమంత చేసినా, లేదా అమలా పేరును సూచించకుండా ఊరుకున్నా ఈ విడాకులు పోస్ట్‌ పోన్‌ అయ్యేవట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలీజ్‌కు ముందే 'బాహుబలి-2' సంచలనాలు... తమిళనాడు హక్కులు రూ.50 కోట్లు!