Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమాకు సైన్ చేయడం ఎలా... సాహోనుంచి వైదొలిగిన అనుష్క

మొత్తం మీద సాహో సినిమాలో అనుష్క నటించడం లేదని తేలిపోయింది. కారణం రెమ్యునరేషన్ కుదరక కాదు. సినిమాలో నటించడానికి డేట్లు కుదరకపోవడమే కారణమట. తను ఇంతకు ముందే అంగీకరించిన చిత్రాలతో బిజీగా ఉండడంతో సాహో చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయించలేని పరిస్థితి అనుష్క

Advertiesment
ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమాకు సైన్ చేయడం ఎలా... సాహోనుంచి వైదొలిగిన అనుష్క
హైదరాబాద్ , గురువారం, 27 జులై 2017 (07:22 IST)
మొత్తం మీద సాహో సినిమాలో అనుష్క నటించడం లేదని తేలిపోయింది. కారణం రెమ్యునరేషన్  కుదరక కాదు. సినిమాలో నటించడానికి డేట్లు కుదరకపోవడమే కారణమట. తను ఇంతకు ముందే అంగీకరించిన చిత్రాలతో బిజీగా ఉండడంతో సాహో చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయించలేని పరిస్థితి అనుష్కకు ఎదురైంది. దీంతో బాలీవుడ్‌ భామ పూజాహెగ్డేకు సాహోలో ప్రభాష్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్‌ బ్యూటీని సాహో కథానాయకిగా ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
 
సాహో చిత్రంలో నటి అనుష్క లేనట్లేనని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. బాహుబలి సిరీస్‌ చిత్రాలతో ప్రపంచ స్థాయి ప్రాచుర్యాన్ని పొందిన జంట ప్రభాస్, అనుష్క. అంతకు ముందు కూడా బిల్లా, మిర్చి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీరిపై వ్యక్తిగతంగానూ చాలానే ప్రచారం జరిగింది. ఆ విషయాలను పక్కన పెడితే బాహుబలి–2 చిత్రం తరువాత ప్రభాష్‌ సాహో అనే చిత్రానికి రెడీ అయ్యారు. 
 
బాహుబలి–2 చిత్ర అమోఘ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున  తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న సాహో చిత్ర మెయిన్‌ పార్టు చిత్రీకరణను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు. ఇందులో ప్రభాస్‌తో రొమాన్స్‌ చేసే నాయకి ఎవరన్నది చిత్ర వర్గాలు స్పష్టం చేయలేదు. అయితే మళ్లీ అనుష్కనే ప్రభాస్‌తో జత కట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది.
 
అలాంటిది తాజాగా సోహో చిత్రంలో నటించడానికి అనుష్క అంగీకరించలేదనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అందుకు కారణం తను ఇంతకు ముందే అంగీకరించిన చిత్రాలతో బిజీగా ఉండడంతో సాహో చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయించలేని పరిస్థితి అనే ప్రచారం జరగుతోంది. ఇది త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్‌ బ్యూటీని కథానాయకిగా ఎంపిక చేసే ప్రయత్నంలో చిత్ర వర్గాలు ఉన్నట్లు సమాచారం. 
 
కాగా బాలీవుడ్‌ భామ పూజాహెగ్డేకు సాహోలో ప్రభాష్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది.ఈ ఉత్తరాది బ్యూటీకిప్పుడు టాలీవుడ్‌లో టైమ్‌ బాగానే ఉంది.అల్లుఅర్జున్‌తో నటించిన దువ్వాడ జగన్నాథం మంచి విజయాన్నే అందించింది భామకు. దీంతో సాహో చిత్ర యూనిట్‌ పూజాహెగ్డేను ఎంపిక చేసే విషయం గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసు... రవితేజ విచారణ తేదీని ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు?(వీడియో)