Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజూ 8 గంటలు అతనితోనే గడుపుతున్న స్వీటీ?

తెలుగు చిత్రసీమలో స్వీటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. ఈమె 'అరుంధతి'గా, 'రుద్రమదేవి'గా, 'దేవసేన'గా ఇలా ఏ పాత్రను ధరించినా అచ్చుగుద్దినట్టు సరిపోతున్నారు. అయితే, ఈ స్వీటీ ఇటీవలి కాలంలో బరువు కాస్

Advertiesment
రోజూ 8 గంటలు అతనితోనే గడుపుతున్న స్వీటీ?
, గురువారం, 31 ఆగస్టు 2017 (14:28 IST)
తెలుగు చిత్రసీమలో స్వీటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. ఈమె 'అరుంధతి'గా, 'రుద్రమదేవి'గా, 'దేవసేన'గా ఇలా ఏ పాత్రను ధరించినా అచ్చుగుద్దినట్టు సరిపోతున్నారు. అయితే, ఈ స్వీటీ ఇటీవలి కాలంలో బరువు కాస్త పెరింగింది. దీంతో ఆమె అసౌకర్యానికి లోనవుతున్నారు. మరీ బరువు పెరిగితే చిత్ర పరిశ్రమకు దూరం కావాల్సి వస్తుందని భావించిన అనుష్క.. ఇపుడు బరువు తగ్గించుకునే పనిలో లీనమైపోయింది. ఇందుకోసం ఆమె ఏకంగా 8 గంటల పాటు చెమటోడ్చుతుందట. 
 
కనీసం 20 కిలోలు తగ్గాలనే లక్ష్యంతో ముంబై నుంచి ప్రత్యేకంగా ట్రైనర్‌ని పిలిపించుకొని వర్కవుట్లు చేస్తోందట. జూబ్లీ హిల్స్‌లోని తన ఇల్లు, జిమ్‌ తప్ప మరో చోటికి ఆమె వెళ్లడం లేదట. రోజుకి కనీసం 8 గంటలు జిమ్‌లోనే ట్రైనర్‌తో అనుష్క గడుపుతోందంటే ఆమె ఎంత సీరియస్‌గా వర్కవుట్లు చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారట. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి లిప్ లాక్ సీన్లన్నీ పెన్ డ్రైవ్‌లో ఇస్తే తాతయ్య "చిల్''