Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుపమ అలిగింది. పవన్ సరసన సీటు కొట్టేసింది

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ.ఆ సినిమాలో యావండీ అనే డైలాగుతో హీరో నితిన్‌నే కాదు.. ప్రేక్షకుల గుండెలను కూడా అదరగొట్టిన అనుపమా పరమేశ్వరన్ ఆ సినిమా రిలీజైన తర్వాత సక్సెస్‌ని ఆస్వాదిస్తూనే తనకు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఇవ్వలేదని అర్థమై త్రివిక్రమ్

అనుపమ అలిగింది. పవన్ సరసన సీటు కొట్టేసింది
హైదరాబాద్ , బుధవారం, 18 జనవరి 2017 (07:56 IST)
అనుపమా పరమేశ్వరన్... ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆమెను తొలి తెలుగు సినిమా త్రివిక్రమ్‌ తిసిన ఆ.ఆ సినిమా. ప్రేమమ్, అ..ఆ... ఈ రెండు సినిమాలూ టాలివుడ్‌లో ఆమె రేంజ్‌ను ఎక్కడికో తీసుకుపోయాయి. కేవలం రెండే రెండు సినిమాలతో ఆమె తెలుగువారికి దగ్గరైంది. ప్రేమమ్‌ సినిమాలో అద్భుత నటనతో అలరించిన సాయిపల్లవికి దక్కని అవకాశం అనుపమకు టాలీవుడ్‌లో ఈ రెండు సినిమాల రూపంలో దక్కింది. 
 
ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ.ఆ సినిమాలో యావండీ అనే డైలాగుతో  హీరో నితిన్‌నే కాదు.. ప్రేక్షకుల గుండెలను కూడా అదరగొట్టిన అనుపమా పరమేశ్వరన్ ఆ సినిమా రిలీజైన తర్వాత సక్సెస్‌ని ఆస్వాదిస్తూనే తనకు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఇవ్వలేదని అర్థమై త్రివిక్రమ్ పై అలక పూనిందట.  అంత మంచి నటనను ప్రదర్సిస్తే చివరికి తనను సైడ్ యాక్టర్‌ స్థాయికి తగ్గించేశారని బాధ పడిపోయింది అనుపమ.
 
త్రివిక్రమ్ ఈ కొత్త తలనొప్పిని ఏం చేసేదిరా అనుకుని తలపట్టుకున్నట్లు భోగట్టా. అనుపమకు అ..ఆ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర ఇవ్వనందున ఆ వెలితిని పూడ్చాలని త్రివిక్రమ్ సిద్ధమైపోయాడని, అమె టాలెంట్‌ను పుల్‌గా వాడుకోవడానికి వీలుగా పవన్‌కల్యాణ్‌తో తను చేయబోతున్న సినిమాలో ఓ పాత్ర కోసం అమెను తీసుకోవాలని త్రివిక్రమ్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
అమ్మాయి అలిగితే ఏదయినా తెచ్చి పెట్టాలి కానీ, ఏకంగా పవన్ కల్యాణ్ సరసనే రోల్ ఇచ్చేశాడే త్రివిక్రమ్ అంటూ టాలివుడ్‌లో ఒకటే గుసగుసలు. తంతే బూర్లగంప కాదు. తన్నకున్నా బూర్లగంప లాగా అయింది అనుపమ పరిస్థితి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఖైదీ' కుమ్ముడుకు తట్టుకోలేక పోతున్న 'బాహుబలి'... జిల్లాల్లో రికార్డులు గల్లంతు!