దిల్ రాజు సినిమా అనేసరికి... చెర్రీ తీసేశాడట... అనుపమ పరమేశ్వర్ షాక్...
నటి అనుపమ పరమేశ్వర్ ఇప్పుడిప్పుడు కొత్త హీరోయిన్‌గా సక్సెస్‌లు సాధిస్తుంది. తాజాగా 'శతమానం భవతి' చిత్రం చేసింది. సక్సెస్ టూర్‌ను కూడా చిత్ర నిర్మాత దిల్‌రాజు వేశాడు. అంతా హాయిగా టూర్ తిరిగి వచ్చారు
నటి అనుపమ పరమేశ్వర్ ఇప్పుడిప్పుడు కొత్త హీరోయిన్‌గా సక్సెస్‌లు సాధిస్తుంది. తాజాగా 'శతమానం భవతి' చిత్రం చేసింది. సక్సెస్ టూర్‌ను కూడా చిత్ర నిర్మాత దిల్‌రాజు వేశాడు. అంతా హాయిగా టూర్ తిరిగి వచ్చారు. కాగా, తాను కొత్త చిత్రాలు కమిట్ అయ్యాయనీ.. అందులో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న సినిమా అని సోమవారం నాడు ట్వీట్ చేసింది. దానికి వెంటనే రియాక్షన్‌గా.. మంగళవారం నాడు ఆమెను తీసేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మీతో కలిసి ప్రయాణం చేయడం కష్టమని వారు పేర్కొన్నారు. దాంతో షాక్‌కు గురయింది. విషయం ఏమంటే.. దిల్ రాజు సినిమాలో చేసిన హీరోయిన్‌ను అగ్రిమెంట్ ప్రకారం.. కొన్ని సినిమాలు చేసేవరకు రాయించుకుంటాడు. ప్రస్తుతం దిల్‌రాజు ఐదు సినిమాలు నిర్మిస్తున్నాడు. అందులో ఒక సినిమాలో తను నటించనుంది కూడా. అయితే.. రామ్ చరణ్ సినిమా అని ఆనందంతో ట్వీట్ చేయడం కూడా ఆమెకు నష్టం చేకూరింది. కొత్తగా వస్తున్న హీరోయిన్ కనుక.. ఇంకా టాలీవుడ్ పద్ధతులు తెలీవని ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు.