Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుప్రియ చెప్పిందే శాసనం... అన్నపూర్ణ స్టూడియోస్ ఏమవుతుంది?

ఈ పంచ్ డైలాగ్ బాహుబలి చిత్రంలో శివగామి చెప్తుంది. ఆమె చెప్పే మాటే శాసనం. తేడా వుండదంతే. ఐతే దాదాపు ఇలాంటి ధోరణినే కనబరుస్తున్నారట యార్లగడ్డ సుప్రియ. ఆమె ఎవరో కాదు... అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు. నటుడు సుమంత్ సోదరి. ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక

సుప్రియ చెప్పిందే శాసనం... అన్నపూర్ణ స్టూడియోస్ ఏమవుతుంది?
, సోమవారం, 3 జులై 2017 (18:36 IST)
ఈ పంచ్ డైలాగ్ బాహుబలి చిత్రంలో శివగామి చెప్తుంది. ఆమె చెప్పే మాటే శాసనం. తేడా వుండదంతే. ఐతే దాదాపు ఇలాంటి ధోరణినే కనబరుస్తున్నారట యార్లగడ్డ సుప్రియ. ఆమె ఎవరో కాదు... అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు. నటుడు సుమంత్ సోదరి. ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వున్నారు. 
 
ఐతే ఆమె తొలుత పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దానితో అన్నపూర్ణ స్టూడియోస్ వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ వస్తున్నారు. తన వ్యాపార దక్షతతో స్టూడియోకు ఓ కార్పొరెట్ లుక్కును తెచ్చేశారు. కానీ స్టూడియోలో కొందరిపై చిన్నాపెద్దా తేడా లేకుండా మాట్లాడేస్తుంటారనే విమర్శలు వస్తున్నాయి. 
 
తుస్కారం మాటలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారనే విమర్శలున్నాయి. ఈమె మాటలను భరించలేని కొందరు తమతమ చిత్రం షూటింగులను రామోజీ ఫిలిం సిటీకి మార్చేసుకుంటున్నారట. దీనితో అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగులు పలుచబడిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె కాస్త సంయమనం పాటిస్తే అటు స్టూడియోకు ఇటు వ్యాపారానికి మంచిదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలూ మొహం ఉన్న అతను పెద్ద హీరోనా? : బన్నీపై కేఆర్కే కామెంట్స్