యాంకర్ వర్షిణి అంటే బుల్లితెర ప్రేక్షకులకు యమాక్రేజ్. స్టార్ మాలో కామెడీ స్టార్స్ షోకి వర్షిణి చేసే యాంకరింగ్ హైలెట్. అంతేకాదు.. బిగ్ బాస్ 5లో కంటెస్టెంటుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుంటే తాజాగా వర్షిణి తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోను వదిలింది. అందులో ఇలియానా లెవల్లో కురచ టాప్ వేసుకుని జీన్స్ వేసుకుని డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఐతే ఆమె డ్యాన్స్ చూసిన కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఓయ్.. వర్షిణీ... డ్యాన్స్ చాల్లేకానీ ముందు నీ పొట్ట తగ్గించు. నీ పొట్ట బాగా ముందుకు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వర్షిణి తగ్గించుకుంటుందో లేదో చూడాలి.