Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేరుకే ఫోటో షూట్... ఆ తర్వాత ఏదేదో చేస్తారు కదా.. అందుకే రూ.కోటి ఇవ్వాలన్న నటి!

దక్షిణాది వెండితెరకు పరిచయమైన మోడల్స్‌లో ఏమీ జాక్సన్ ఒకరు. 2010లో వచ్చిన మదరాసిపట్టిణం అనే చిత్రం ద్వారా కోలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్‌లో విక్రమ్.. రజనీకాంత్ వంటి స్టార్

Advertiesment
పేరుకే ఫోటో షూట్... ఆ తర్వాత ఏదేదో చేస్తారు కదా.. అందుకే రూ.కోటి ఇవ్వాలన్న నటి!
, శనివారం, 19 ఆగస్టు 2017 (10:16 IST)
దక్షిణాది వెండితెరకు పరిచయమైన మోడల్స్‌లో ఏమీ జాక్సన్ ఒకరు. 2010లో వచ్చిన మదరాసిపట్టిణం అనే చిత్రం ద్వారా కోలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్‌లో విక్రమ్.. రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చేయడం వలన, స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే, ఈ అమ్మడుకి "దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న" పెద్దల నానుడిని బాగా ఒంటబట్టించుకుంది.
 
నిజానికి ఈ సుందరి నటించిన సినిమాల సంఖ్యను వేళ్లపై లెక్కబెట్టొచ్చు. అలాంటి ఎమీ జాక్సన్‌ను తమ ప్రోడక్ట్స్‌కి ప్రచారకర్తగా తీసుకోవాలని ఒక కార్పొరేట్ సంస్థ ముందుకు వచ్చింది. ఆమెతో రూ.3 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాళ్లు ఆమెతో ఓ 6 గంటల పాటు ఫోటో షూట్ చేయించాలనుకున్నారు. 
 
అయితే ఫోటో షూట్‌కి అదనంగా ఎమీ జాక్సన్ కోటి రూపాయలు అడిగిందట. అంతే .. ఆ సంస్థ నిర్వాహకులు కోలుకోవడానికి కొంత సమయం పట్టిందట. పైగా, ఇంత డిమాండ్ చేయడానికి కూడా వివరణ ఇచ్చిందట. షూటింగ్ పేరుతో సమయాన్ని వృధా చేయడమే కాకుండా, ఇంకా ఏదేదో చేస్తారంటూ ముక్తాయింపునిచ్చిందట. దీంతో ఆ సంస్థ నిర్వాహుకులు మరోమాట మాట్లాడకుండా తిరుగుముఖం పట్టారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడక గదికి వస్తే ఛాన్సిస్తానన్నారు : శ్రద్ధా దాస్ (Hot Video)