Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళ బిజెపి అధ్యక్షురాలిగా త్రిష - అమిత్ షా నుంచి ఫోన్?

ఆకర్ష్‌లో భాగంగా భారతీయ జనతా పార్టీ సినీ ప్రముఖుల మీద పడింది. తమిళనాట రాజకీయాలపై ఇప్పటికే ఒక కన్నేసిన బిజెపి కొంతమంది సినీప్రముఖులను తనవైపు తిప్పుకుని పార్టీ జెండా కప్పేందుకు ప్రయత్నిస్తోంది. రజినీ, కమల్ హాసన్ ఇలా ప్రముఖ నటులు పార్టీ పెట్టేందుకు సిద్

తమిళ బిజెపి అధ్యక్షురాలిగా త్రిష - అమిత్ షా నుంచి ఫోన్?
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (20:21 IST)
ఆకర్ష్‌లో భాగంగా భారతీయ జనతా పార్టీ సినీ ప్రముఖుల మీద పడింది. తమిళనాట రాజకీయాలపై ఇప్పటికే ఒక కన్నేసిన బిజెపి కొంతమంది సినీప్రముఖులను తనవైపు తిప్పుకుని పార్టీ జెండా కప్పేందుకు ప్రయత్నిస్తోంది. రజినీ, కమల్ హాసన్ ఇలా ప్రముఖ నటులు పార్టీ పెట్టేందుకు సిద్ధమైనా ఆ తరువాత వారిని తనవైపు తిప్పుకోవాలన్న బిజెపి అధినాయకులు ప్రయత్నించి చివరకు విఫలమయ్యారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సినీ ప్రముఖులు ఒక్కొక్కరిని తమవైపు తిప్పుకుని పార్టీని ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు.
 
త్రిష. తమిళనాడులో క్రేజ్ ఉన్న హీరోయిన్. 34 యేళ్ళ వయస్సుల్లోను యువ హీరోయిన్‌లా నటిస్తూ అందరినీ మెప్పిస్తోంది. ఈ హీరోయిన్‌ను బిజెపిలోకి లాగే ప్రయత్నం ప్రారంభమైంది. త్రిషను బిజెపిలోకి తీసుకునేందుకు ఏకంగా అమిత్ షానే ఆమెకు ఫోన్ చేశారట. గత మూడురోజుల క్రితం చెన్నైలో ఉన్న త్రిషకు ఫోన్ వచ్చిందట. సర్.. మాట్లాడుతారు.. లైన్‌లో ఉండండి.. అని.. హీరోయిన్ ఫోన్లకు ఎవరో ఒకరు ఆకతాయి ఫోన్లు చేస్తుంటారని.. ఆమె ఫోన్ కట్ చేసిందట. 
 
మళ్ళీ తిరిగి అదే నెంబర్ నుంచి చాలాసార్లు కాల్ వస్తే ఫోన్ తీశారట త్రిష. నేను అమిత్ షా అంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడడం ప్రారంభించారట. మీ సేవలు పార్టీకి అవసరం. పార్టీలో కీలక బాధ్యతలు మీకు ఇస్తాము. ఢిల్లీకి రండి అంటూ త్రిషతో అమిత్ షా మాట్లాడారట. అయితే త్రిష మాత్రం తరువాత మాట్లాడదామని ఫోన్ పెట్టేశారట. తన స్నేహితులతో ఇప్పటికే త్రిష ఈ విషయంపై మాట్లాడారట. కానీ రాజకీయాల గురించి పెద్దగా ఆసక్తి లేని త్రిష ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే బిగ్ బాస్ హౌస్‌లో కాలుపెట్టలేదు: ఫేస్‌బుక్ లైవ్‌ఛాట్‌లో శ్రీముఖి