Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటేనే పడదు.. అమీషా పటేల్

Advertiesment
amisha patel
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (11:55 IST)
సన్నీ డియోల్‌తో కలిసి నటించిన అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ 2 చిత్రం గురించి అమీషా పటేల్ మాట్లాడుతూ... రొమాంటిక్ సీన్స్‌కు తాను వ్యతిరేకం కాదని చెప్పింది. వెండితెరపై రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. సల్మాన్ ఖాన్, సన్నీడియోల్ సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చేయరు. వెండితెరపై రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని నిబంధన పెట్టారు. 
 
నాకు ఇదే నియమం ఉంది. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అసౌకర్యంగా అనిపిస్తుంది. వెండితెరపై నేను ముద్దుపెట్టుకోలేను. అలాగే అమ్మను, చెల్లిని తిట్టడం లాంటి డైలాగులు మాట్లాడలేను. పొట్టి బట్టల్లో చర్మాన్ని చూపించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బికినీల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలను ఆరబోస్తూ హద్దులు దాటుతూనే ఉంది.
 
ఇకపై.. తెలుగు సినిమాల్లో కూడా నటించింది. బద్రి సినిమాతో ఆమెను టాలీవుడ్‌కి తీసుకొచ్చాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. బద్రి సూపర్ హిట్. బద్రి తర్వాత అమీషా నటించిన నాని, నరసింహులు తెలుగులో డిజాస్టర్‌గా నిలిచాయి. ఆమె మూడవ చిత్రం గదర్ బ్లాక్ బస్టర్. ఆమె తొలి చిత్రం కహోనా ప్యార్ హై భారీ విజయాన్ని సాధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జబర్దస్త్' కమెడియన్ నవసందీప్ అరెస్టు